వెజ్ ఖీమా మసాలా ఇది ఫేమస్ పంజాబీ దాభా రెసిపీ. వేడి వేడి పుల్కా, చపాతీ, పురీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. కావలసిన కూరగాయలని ఖీమా లా చేసి చేస్తారు అందుకే దీనికి ఆ పేరు. ఎప్పుడైనా స్పెషల్ పార్టీస్ లో ఇది ట్రై చేయండి అందరికి నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నింటికీ మించి ఇది తెలుగు వారికి సరిపోయేలా కారంగా ఘాటుగా ఉంటుంది.

కావలసినవి:

 • కాప్సికం తరుగు- ½ కప్
 • ఫ్రోజెన్ బాటనీ- ¼ కప్
 • కేరట్ తరుగు- ½ కప్
 • ఫ్రెంచ్ బీన్స్ తరుగు- ½ కప్
 • ఉల్లిపాయ సన్నని తరుగు- ½ కప్
 • టమాటో పేస్టు- 3 టమాటో లది
 • పచ్చిమిర్చి తరుగు-2
 • కొత్తిమీర- 2 tbsps
 • కారం- 2 tsps
 • ధనియాల పొడి- 1 tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • గరం మసాలా- 1 tsp
 • కాశ్మీరీ కారం- ½ tsp
 • ఉప్పు
 • జీలకర్ర- 1 tsp
 • అల్లం వెల్లులి పేస్టు- 1 tbsp
 • వెల్లులి తరుగు- 2 tsps
 • జీడి పప్పు పేస్టు- 2 tsps
 • కసూరి మేతి- 1 tsp
 • ఫ్రెష్ క్రీం- 1 tsp
 • నూనె- 2 tbsps
 • బటర్- 1 tbsp
 • నెయ్యి- 2 tsps
 • నీళ్ళు- 250 ml

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె బటర్ వేడి చేసి అందులో జీలకర్ర, వెల్లులి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోండి
 2. ఇప్పుడు ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోండి
 3. ఇప్పుడు ఉప్పు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కష్మీరి కారం వేసి బాగా వేయించి, కాప్సికం ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి
 4. ఇప్పుడు టమాటో పేస్టు వేసి టొమాటోలు పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి
 5. ఇప్పుడు కేరట్ తరుగు, ఫ్రెంచ్ బీన్స్ తరుగు వేసి ముక్కలు మగ్గే దాకా ఫ్రై చేసుకోండి
 6. ఇప్పుడు ఫ్రోజెన్ బాటనీ వేసి మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుని నీళ్ళు పోసి, జీడిపప్పు పేస్టు వేసి బాగా కలుపుకుని కూర దగ్గర పడనివ్వండి.
 7. దింపే ముందు కొత్తిమీర తరుగు, ఫ్రెష్ క్రీం, నెయ్యి కసూరి మేతి వేసి బాగా కలిపి మరో 3 నిమిషాలు కుక్ చేసుకోండి.

టిప్స్:

 • ఈ కూరకి అన్ని కురగాలని సన్నగా ఖీమా లా తరుక్కోండి
 • ఇందులో మేము ఫ్రోజెన్ బటాని వాడాము ఇవి త్వరగా కుక్ అవుతాయ్, కాబట్టి లాస్ట్ లో వేసము. మీరు తాజా బాటనీ వాడుతున్నట్లయితే వాటిని 30 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టి ఆ తరువాత కప్సిచుం తో పాటు వేసుకోండి, లేదంటే సరిగా కుక్ అవ్వవు
 • జీడిపప్పు పేస్టు వేస్తే కుర చిక్కగా వస్తుంది, ఇష్టం లేకపోతే వదిలేయోచ్చు