“వెజ్ తహ్రీ” ఇది హైదరాబాద్ ఫేమస్ రెసిపీ. ఇది చాలా స్పసీగా ఉంటుంది. చేయడం చాల తేలిక. ఏదైనా స్పెషల్ డేస్ లో, పార్టీ అప్పుడు ఇది చేయండి అందరికి నచ్చుతుంది. దీనితో ఏదైనా రైతా చాలా బాగుంటుంది.

కావలసినవి:

 • బాసుమతి బియ్యం- 1 కప్(గంట నానబెట్టినవి)
 • కాలీఫ్లవర్- 10 ముక్కలు
 • ఓ బంగాళాదుంప ముక్కలు
 • మీల్ మేకర్- 10-15 (30 నిమిషాలు నానబెట్టినవి)
 • పచ్చి బాటాని- ¼ కప్
 • ఫ్రెంచ్ బీన్స్- ½ కప్
 • కేరట్ ముక్కలు- ½ కప్
 • ఉల్లిపాయ చీలికలు- ½ కప్
 • టమాటో- 1
 • పచ్చిమిర్చి చీలికలు- 4
 • పెరుగు- ½ కప్
 • నీళ్ళు- 1 కప్
 • కొత్తిమీర తరుగు- 2 tbsps
 • పుదీనా తరుగు- 2 tbsps
 • కారం- 1 tsp
 • పసుపు-1/4 tsp
 • గరం మసాలా- 1/2 tsp
 • సాల్ట్
 • యలకలు- 2
 • లవంగాలు- 2
 • బిరియాని ఆకు- 1
 • షాహీ జీరా- 1 tsp
 • జీలకర్ర- 1 tsp
 • అనాస పువ్వు- 1 tsp
 • నెయ్యి- 3 tsps
 • నూనె- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. కుక్కర్ లో నెయ్యి, నూనె వేడి చేసి అందులో యాలకలు, అనాసపువ్వు, బిరియాని ఆకు, షాహీ జీరా, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించి, ఆ తరువాత ఉల్లిపాయ చీలికలు వేసి పచ్చి వాసన పోయే దాక ఫ్రై చేసుకోండి.
 2. ఇప్పుడు అల్లం వెల్లులి పేస్టు వేసి ఫ్రై చేసుకోండి, ఆ తరువాత మిగిలిన కూరగాయ ముక్కలు, మీల్ మేకర్ అన్నీ వేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
 3. ఆ తరువాత కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్ వేసి ముక్కలకి బాగా పట్టించి 50 ml నీళ్ళు పోసి నీళ్ళు ఇగిరిపోయేదాక బాగా ఫ్రై చేసుకోండి
 4. నీరు ఇగిరిన తరువాత ఎసరు కోసం కప్ నీళ్ళు పోసి ఎసరుని బాగా పొంగనివ్వండి. ఎసరు బాగా తెర్లుతున్నప్పుడే అందులో నానబెట్టిన బాసుమతి బియ్యం, పెరుగు, పుదినా తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద ఓ విసిల్ రానివ్వండి. ఆ తరువాత స్టవ్ ఆపేసి 15 నిమిషాలు వదిలేయండి.
 5. 15 నిమిషాల తరువాత అడుగు నుండి గరిట తో కలుపుకోండి. ఇది స్పైసీగా ఉంటుంది, రైతాతో పర్ఫెక్ట్ గా ఉంటుంది.
 6. pressure
 7. pressure

టిప్స్:

 • ఎసరు తెర్లకుండ బాస్మతి బియ్యం వేస్తే ముద్దవుతుంది.
 • మామూలు బియ్యానికి కప్ బియ్యానికి 1.5 కప్స్ నీళ్ళు తీసుకోవాలి, 30 నిమిషాలు నానబెట్టాలి, 1 విసిల్ రావాలి.