వెజ్ మోమొస్
“వెజ్ మోమొస్” ఇది ఫేమస్ చైనీస్ రెసిపీ. ఇది భారత్ లో ఎంత ఫేమస్ అయిపోయిందంటే సిటీస్ లో దాదాపుగా ప్రతీ వీధిలో దొరికేస్తున్నాయ్! చేయడం చాలా సింపుల్. పిల్లలూ చాలా ఇష్టంగా తింటారు.మోమొస్ ఎన్నో రకాలుగా చేస్తారు. ఫ్రైడ్ మోమొస్, తందూరీ మోమొస్, చికెన్, పనీర్, చాక్లెట్ మోమొస్ ఇలా ఎన్నో. అన్నీ రుచి లో వేటికవే ప్రత్యేకం, కానీ పైన వేసే షీట్స్ అన్నిటికి ఒక్కటే.మోమొస్ కి పైన షీట్స్ నేను మైదా తో చేస్తున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి వాడుకోవచ్చు.మోమొస్ కి వాడే షీట్స్ సాధ్యమైనంత పల్చగా వత్తుకోవాలి, అప్పుడు బాగుంటాయి తినడానికి. ఇంకా పిండిని ఎక్కువ సేపు వత్తుకోవాలి, అప్పుడు పిండి సాగి మోమొస్ కి రుచి, పల్చని షీట్స్ వస్తాయ్.మోమొస్ కి షీట్స్ వత్తుకునేప్పుడు మధ్యలో కాస్త మందంగా చుట్టూ పల్చగా వత్తుకుంటేనే లోపలి స్టఫ్ఫింగ్ పగిలి బయటకి రాదు.ఈ వెజ్ మోమొస్ లో వాడిన కేబెజ్, కాప్సికం, కేరట్ వీటిని గట్టిగా పిండాలి ఓ గుడ్డలో వేసి, అప్పుడు రసం దిగి స్టఫ్ చేసాక మోమొస్ మరీ చెమ్మగా అవ్వవు, పగలవు వెజిటేబుల్స్ లోంచి పచ్చివాసన రాదు.
Tips
మోమొస్ 12 నిమిషాల తరువాత బాగా స్టీం అయితేనే సర్వ్ చేసుకోండి.
Ingredients
స్టఫ్ఫింగ్ కోసం:
- ½ cup క్యాబేజీ తురుము
- 2 tbsp క్యాప్సికం సన్నని తరుగు
- 2 tbsp కారెట్ తురుము
- ½ tbsp అల్లం తరుగు
- 1 tbsp వెల్లుల్లి తరుగు
- ½ tbsp లైట్ సోయా సాస్
- ½ tbsp వైట్ పెప్పర్ పౌడర్
- ½ tbsp నల్ల మిరియాల పొడి
- సాల్ట్
మొమో షీట్స్ కోసం:
- 1 cup మైదా పిండి
- ఉప్పు కొద్దిగా
- నీళ్ళు తగినన్ని
Instructions
- మైదా పిండిలో ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ, ఎక్కడా పగుళ్ళు లేకుండా ఎక్కువ సేపు వత్తుకోవాలి.
- వత్తుకున్న పిండిని తడి గుడ్డ కప్పి 30 నిమిషాలు నానబెట్టాలి.
- లోపలి స్టఫ్ఫింగ్ కోసం:
- క్యాబేజీ, కారెట్, క్యాప్సికం ఓ గుడ్డ లో వేసి సాధ్యమైనంత గట్టిగా పిండితే, నీరంతా వచ్చేస్తుంది.
- పిండుకున్న వెజిటేబుల్ మిశ్రమంలో స్టఫిఇంగ్ కోసం ఉంచిన మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి కలుపుకోవాలి.
- 30 నిమిషాలు నానిన పిండిని చిన్న ఉసిరికాయంత ఉండలు చేసుకోండి.
- పొడి పిండి చల్లి, పల్చని రోటీల్లా వత్తుకోండి.
- వత్తుకున్న రోటీలలో 1 tbsp స్టఫ్ఫింగ్ ఉంచి తడి చేతులతో ముందు రెండు వైపులా సీల్ చేసి కుచ్చులులా చేసి రెండు అంచులని కలిపి సీల్ చేయాలి, ఇలాగే మిగిలినవి.
- స్టీమర్లో లేదా కుక్కర్ లో నీళ్ళు పోసి మోమొస్ స్టీమర్ లేదా అడుగు ఓ కప్ లేదా స్టాండ్ ఉంచి దానిమీద ఓ జల్లెడ ఉంచి దాన్ని నూనె తో గ్రీస్ చేసుకోండి.
- తరువాత మోమొస్ ఉంచి మూత పెట్టి 12 నిమిషాలు స్టీం చేసుకోండి. మీడియం-ఫ్లేం మీద 7 నిమిషాలు 5 నిమిషాలు లో- ఫ్లేం మీద.
- ఇవి వేడిగా మోమొస్ చట్నీతో లేదా కేట్చప్ తో సర్వ్ చేసుకోండి.
Video