“వెనీలా ఐస్ క్రీం” ఇది ఐస్ క్రీమ్స్ లో రారాజు. ఇదొక్కటి పర్ఫెక్ట్ అయితే ఎన్నో ఎన్నో ఐస్ క్రీమ్స్ చేయచ్చు. మార్కెట్ లో దొరికే ప్రతీ ఫ్లేవర్ వెనీలా ఐస్ క్రీం బేస్ తోనే చేస్తారు, చేయొచ్చు కూడా.

ఓ సారి ఈ స్టైల్ వెనీలా ఐస్ క్రీం చేస్తే ఇంకేప్పుడూ మార్కెట్ నుండి కొనరు, అంత కంటే బెస్ట్ గా పర్ఫెక్ట్ గా మీరు ఇంట్లోనే చేస్తారు గనుక. చాలా తక్కువ పదార్ధాలతో కచ్చితమైన కొలతలు టిప్స్ తో ఈ స్టైల్ లో చేస్తే ఎప్పుడైనా బెస్ట్ ఐస్ క్రీం వస్తుంది.

ఈ ఐస్ క్రీం నేను ప్రీమియం క్వాలిటీ వెనీలా ఐస్ క్రీం అంటాను. ఇందులో నేను వాడిన పదార్ధాలు అలాంటి రుచిని ఇస్తాయి.   ఈ రెసిపీ అంతట ఎన్నో టిప్స్ ఉన్నాయ్, వాటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డౌట్ ఉంటె పైన వీడియో ఉంది చూడగలరు.

ఇందులో నేను ఐస్ క్రీం బేస్ గా విప్పింగ్ క్రీం వాడను. విప్పింగ్ క్రీం, ఫ్రెష్ క్రీం ఒకటి కాదు. ఫ్రెష్ క్రీం అంటే పాల మీగడ. విప్పింగ్ క్రీం కూడా పాల కొవ్వు నుండి చేసేదే అయినా, విప్పింగ్ క్రీం లో ఉండే వెన్న శాతం, చిక్కదనం ఫ్రెష్ క్రీం కి రాదు. విప్పింగ్  క్రీం లో పంచదార ఉంటుంది. ఫ్రెష్ క్రీం చప్పగా ఉంటుంది.

ఈ ఐస్ క్రీం లో వాడిన పాల పొడి కి బదులు పిల్లల పాల పొడి వాడకండి. అందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.

వెనీలా ఎప్పుడూ ప్యూర్ దే వాడడానికి ట్రై  చేయండి. బెస్ట్ గా ఉంటుంది టేస్ట్!

ఇందులో కండెన్స్డ్ మిల్క్ వాడాను. ఆ రెసిపీ త్వరలో ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చెప్తాను, లేదంటే రెడీమేడ్ గా దొరికేస్తుంది.

ఐస్ క్రీం నేను ఫ్రీజర్ సేఫ్ ప్లాస్టిక్ డబ్బా లో ఫ్రీజ్ చేశా, దీని బదులు మీరు స్టీల్, లేదా మరింకేదైనా మెటల్ గిన్నెలో పోసి పోలీతీన్ కవర్ లేదా అల్యుమినీయం ఫాయిల్ తో కవర్ చేసి ఫ్రీజ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ గా త్వరగా గట్టి పడిపోతుంది.

ఐస్ క్రీం ఫ్రీజింగ్ ఎప్పుడూ ఫ్రిజ్ లో సాధ్యమైనంత తక్కువ డిగ్రీలకి తగ్గించి ఫ్రీజ్ చేసుకోండి.  ఫ్రీజ్ చేసేప్పుడు సాదారణంగా రాత్రంతా ఫ్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ గా ఫ్రీజ్ అవుతుంది. ఓ సారి ఫ్రిజ్ లో ఐస్ క్రీం పెట్టాక, సరిగా గడ్డకట్టేంత వరకు ఫ్రిజ్ తెరవకండి. ఇది సింగిల్ డోర్ ఫ్రిజ్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం.

ఐస్ క్రీం ఫ్రీజ్ అయ్యేప్పుడు  మధ్యలో కరెంట్ పోతే ఐస్ క్రీం కరిగి పోతుంది, కరెంట్ వస్తే మళ్ళీ గట్టి పడుతుంది. ఇలా జరిగితే ఐస్ క్రీం రుచిలో మార్పు రాకపోయినా, అక్కడక్కడ తరకలుగా  తగులుతుంది ఐస్ క్రీం. ఒకవేళ అలా అయితే మళ్ళీ విప్ చేసి ఫ్రీజ్ చేసుకోండి.

విప్పింగ్ క్రీం ని విప్ చేయడానికి బీటర్ తో అయితే లోపల గాలి ఏర్పడి, ఐస్ క్రీం చాలా స్మూత్ గా ఉంటుంది. మిక్సీ లో వేసి తిప్పితే ఆ వేగానికి గాలి పోయి అంత స్మూత్ గా ఉండకపోయే అవకాశం ఉంది.

ఇవి కూడా ట్రై చేయండి:

కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీం
మలై కుల్ఫీ
కోకోనట్ కులుక్కి
పార్లే-జీ మిల్క్ షేక్

కావలసినవి:

 • విప్పింగ్ క్రీం- 1.5 కప్స్( 375 ml)
 • కండెన్స్డ్ మిల్క్- 3/4 కప్
 • చిక్కని పాలు- 250 ml(కాచి గంట ఫ్రిజ్ లో ఉంచినవి)
 • పాల పొడి- 1/4 కప్
 • వనీల ఎస్సెన్స్- 1.5 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. చల్లని అంటే ఫ్రీజర్ లో ఉంచిన విప్పింగ్ క్రీం ని బాగా బీట్ చేసుకోవాలి. (నేను వాడుతున్నది కాస్త గడ్డకట్టేసింది, మీరు చిక్కని మజ్జిగలా ఉన్న స్టేజ్ లో విప్పింగ్ క్రీం వాడుకోండి).
 2. బీటింగ్ సాఫ్ట్ పీక్స్ వచ్చేదాకా బీట్ చేయాలి. సాఫ్ట్ పీక్స్ అంటే నురగా వచ్చిన విప్పింగ్ క్రీం పైకి లేచి కొద్దిగా కిందికి వాలాలి.
 3. ఇప్పుడు చల్లని కండెన్స్డ్ మిల్క్, వనీలా, పాల పొడి, పాలు పోసి హై స్పీడ్ మీద బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి.
 4. తరువాత ఫ్రీజర్ సేఫ్ డబ్బాలో, లేదా స్టీల్ మౌల్ద్ లో పోసి మూత పెట్టి కనీసం 8 గంటలు ఫ్రీజ్ చేయాలి. (రాత్రంతా ఫ్రీజ్ చేస్తే బెస్ట్)
 5. తరువాతి రోజు స్కూపర్ నీళ్ళలో ముంచి స్కూప్ చేసి సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • పాల పొడి, వనీల ఎసెన్స్ తప్ప అన్నీ చల్లనివి వాడుకోండి. త్వరగా విప్ అవుతుంది.