“షెజ్వాన్ ఫ్రైడ్ రైస్” ఈ ఇండో- చైనీస్ రెసిపీ తెలుగు వారికి చాలా బాగా నచ్చుతుంది. ఇండో- చైనీస్ రేపీస్ అన్నీ కారం లేక  మిరియాల పొడితో చప్పగా ఉంటాయి. కానీ ఈ ఫ్రైడ్ రైస్ చాలా స్పైసీగా, ఘాటుగా మనకి నచ్చేలా ఉంటుంది.

నేను ఇంతకూ ముందు చాలా ఇండో చైనీస్ ఫ్రైడ్ రైస్ రేసిపీస్ చేశాను చుడండి. అవి మీకు తప్పక నచ్చుతాయ్. ఇంకా నేను చేసిన షెజ్వాన్ సాస్ రెసిపీ కూడా ఉంది చుడండి.

ఇవి కూడా ట్రై చేయండి:

షేజ్వాన్ సాస్
చైనీస్ క్రిస్పీ కార్న్
క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్
బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్
వెజ్ మోమొస్

కావలసినవి:

 • పొడిపొడిగా వండుకున్న బాస్మతి రైస్- 1 కప్(185 gms)
 • నూనె- 1/4 కప్
 • సన్నని కేరట్ తరుగు- 1/4 కప్
 • సన్నని బీన్స్ తరుగు- 1/4 కప్
 • ఉల్లికాడల తరుగు- 2 tbsps
 • ఎండు మిర్చి-4
 • షెజ్వాన్ సాస్- 1/4 కప్
 • ఉప్పు
 • తెల్ల మిరియాల పొడి- 3/4 కప్
 • ఆరోమేటిక్ పౌడర్- 3/4 tsp
 • అనాస పువ్వు పొడి- 3/4 tsp
 • లైట్ సోయా సాస్- 1/2 tsp
 • వెనిగర్- 1/2 tsp

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె బాగా మరిగించి అందులో ఎండుమిర్చి, కేరట్ తరుగు, ఉల్లికాడల తరుగు వేసి హై ఫ్లేం మీద 70% వేగనివ్వండి.
 2. తరువాత షెజ్వాన్ సాస్ వేసి బాగా ఫ్రై చేయండి.
 3. ఇప్పుడు ఉప్పు, తెల్ల మిరియాల పొడి, ఆరోమేటిక్ పొడి, అనాస పువ్వు పొడి వేసి బాగా కలుపుకోండి.
 4. పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి హై ఫ్లేం మీద బాగా పట్టించండి.
 5. తరువాత లైట్ సోయా సాస్, వెనిగర్ వేసి బాగా టాస్ చేయండి హై ఫ్లేం మీద.
 6. దింపే ముందు చిటికెడు పంచదార, ఉల్లికాడల తరుగు వేసి బాగా టాస్ చేసి దిమ్పెసుకోండి.

 బెస్ట్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కొన్ని టిప్స్:

 • షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అంటే తప్పకుండా స్టార్ ఆన్స్ పౌడర్ అదే అనాసపువ్వు పొడి వాడాలి, ఇది వేయడం వల్ల మాంచి సువాసన తో ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేసి తీరాలి కూడా.
 • బాస్మతి  బియ్యం ఓ కప్ అంటే 185 gms. గంట నానబెట్టి కాస్త ఉప్పేసి ఉడికించి, నీరు వార్చి ఆరబెట్టేస్తే పొడిపొడి గా వస్తుంది. మాంచి క్వాలిటీ రైస్ వాడుకోండి.
 • రైస్ లో వాడే షెజ్వాన్ సాస్ కారం అన్నది మీరు వాడే మిరపకాయల క్వాలిటీ, లేదా బయటనుండి కొంటె ఆ బ్రాండ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ రుచి చూసి మీకు తగినట్లుగా వేసుకోండి.
 • ఇందులో నేను ఆరోమేటిక్ పౌడర్ వాడను, అది అజినోమోటోకి బదులుగా. ఇది ఆన్లైన్లో  దొరుకుతుంది. అందుబాటులో లేకపోతే వదిలేయండి. నచ్చితే అజినోమోటో వాడుకోండి.
 • ఆఖరున దింపే ముందు చిటికెడు పంచదార ఫ్లేవర్స్ చక్కగా బేలన్స్ చేస్తుంది.
 • చైనీస్ ఎప్పుడూ, హై ఫ్లేం మీద టాస్ చేస్తూ చేసుకుంటేనే స్మోకీ ఫ్లేవర్ తో చాలా రుచిగా ఉంటుంది.