“షేజ్వాన్ సాస్/చట్నీ” ఇది ఫేమస్ ఇండో చైనీస్ రెసిపీ. ఈ చట్నీతో చేసే రేసిపీస్ అందరికి ఎంతో ఇష్టం! దీనికుండే కారం దక్షిణ భారత దేశం వారికి తప్పకుండా నచ్చుతుంది. ఈ చట్నీ ఓ సారి  చేసి ఉంచుకుంటే కనీసం 4 నెలలు ఫ్రిజ్ లో నిలవుంటుంది.

ఈ షేజ్వాన్ చట్నీతో షేజ్వాన్ నూడుల్స్, షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఇంకా ఎన్నో ఎన్నో చేసుకోవచ్చు. ఇంకా మంచూరియన్ తో పాటు ఇంకా ఎన్నో స్నాక్స్ లో వాడే  చైనీస్ చిల్లీ పేస్టుకి బదులు ఇది వాడుకోవచ్చు. 
ఇందులో నేను సెలేరి అని ఓ ఆకుకూర కాడలు వాడను, వాడాలి. ఇవి అన్నీ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయ్. ఒక వేళ దొరకలేదంటే వదిలేయండి. కానీ వేయాలి, వేస్తారు అని గుర్తుంచుకోండి. దొరికినప్పుడు చేసుకోండి.

ఇంకా ఇందులో అనాస పువ్వ్ ( స్టార్ ఆన్స్ ) పొడి వేయాలి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ లో  మీరు ఏ కప్ తో అయిన కొలిచి వేసుకోవచ్చు వేసే పాదార్ధలన్నీ. నేను చేసే కొలత కి 1/2 కిలో పైన పచ్చడి వస్తుంది.

చైనీస్ ఎప్పుడు హై ఫ్లేం మీదే దగ్గరుండి కలుపుతూ వేపుకోవాలి లేదంటే ఫ్లేవర్ రాదు.

ఇవి కూడా ట్రై చేయండి:

క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్
డ్రాగన్ చికెన్
ఇన్స్టంట్ సూపీ నూడుల్స్

కావలసినవి:

 • నూనె- 1 కప్
 • ఎండు మిర్చి- 150 gms( 30 నిమిషాలు వేడి నీళ్ళలో నానా బెట్టి పేస్టు చేసుకోవాలి)
 • వెల్లూలి తరుగు- 1 కప్( పొట్టు తీసినవి)
 • అల్లం తరుగు- 3/4 కప్
 • సెలేరీ తరుగు- 1/2 కప్
 • సాల్ట్- 1 tbsp
 • వెనిగర్/నిమ్మరసం- 3 tbsps
 • అనాస పువ్వు పొడి- 1 tbsp
 • నీళ్ళు – 1 50 ml

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె మరిగించి అందులో వెల్లూలి తరుగు, అల్లం తరుగు వేసి హై ఫ్లేం మీద కలుపుతూ పచ్చి వాసన పోయే దాక వేపుకోవాలి.
 2. పచ్చి వాసన పోయాక అప్పుడు, సెలేరి తరుగు వేసి బంగారు రంగు వాచ్చే దాక కలుపుతూ వేపుకోవాలి.
 3. బంగారు రంగు వచ్చాక ఎండు మిర్చి పేస్టు వేసి నూనే పైకి తేలేదాకా వేపుకోవాలి.
 4. ఆ తరువాత ఉప్పు, వెనిగర్, అనాస పువ్వు పొడి వేసి బాగా కలుపుకోవాలి.
 5. ఇప్పుడు 150 ml నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేం మీద నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. మధ్య మధ్య లో కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది.
 6. నూనె పైకి తేలాక దింపి చల్లార్చి గాజు సీసాలో ఉంచుకుంటే బయట 2 నెలలు, ఫ్రిజ్ లో 4 నెలలు నిలవుంటుంది.

టిప్స్:

 • చైనీస్ ఎప్పుడూ హై ఫ్లేం మీదే వేపుకోవాలి అప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.