సజ్జ రొట్టెలు ఇవి దేశమంతట చాలా ఎక్కువమంది ఇష్టపడతారు. ఎంతో ఆరోగ్యకరమైన రొట్టెలు. వేడి వేడిగా పప్పు, కూర లేదా చికెన్, మటన్ దేనితోనైనా చాలా రుచిగా ఉంటాయ్. గంటల తరువాత కూడా మెత్తగా దూది లా ఉంటాయ్.ఈ రొట్టెలు ప్రత్యేకించి తెలంగాణా లో రాయలసీమ లో ఎక్కువ చేస్తుంటారు మన దగ్గర. ఇంకా కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్ర ప్రజలు చాలా ఎక్కువగా చేస్తుంటారు!

కావలసినవి:

 • సజ్జ పిండి – కప్
 • నీళ్ళు- కప్
 • సొరకాయ తురుము- ¼ కప్
 • ఉప్పు

విధానం:

Directions

0/0 steps made
 1. నీళ్ళు మరిగించి అందులో ఉప్పు, సొరకాయ తురుము వేసి ఓ పొంగు రానివ్వండి.
 2. ఓ పొంగోచ్చాక అప్పుడు సజ్జ పిండి వేసి కలిపి స్టవ్ ఆపేసి మూత పెట్టి 15 నిమిషాలు వదిలేయండి
 3. 15 నిమిషాల తరువాత వేడి మీదే బాగా ఎక్కువ సేపు 5-6 నిమిషాల పాటు వత్తుకోండి
 4. తరువాత సమానంగా బాల్స్ గా చేసుకోండి పిండిని
 5. ఇప్పుడు పిండి ముద్ద మీద కాస్త ఎక్కువగా పొడి పిండి చల్లి నిదానంగా ప్రెషర్ ఇవ్వకుండా వత్తుకోండి, మరీ పల్చగా మరీ మందంగా కాకుండా వత్తుకోండి
 6. ఇప్పుడు వేడి వేడి పెనం మీద వేసి 2 నిమిషాలు వదిలేయండి, ఆ తరువాత పై వైపు రొట్టె మీద నీళ్ళతో తడి చేసి తిప్పి కాల్చుకోండి.
 7. ఈ రొట్టెలు మీడియం ఫ్లేం మీద మాత్రమే కాల్చాలి. కాలడానికి కాస్త టైం పడుతుంది.
 8. వేడి వేడిగా నచ్చిన కర్రీ తో ఎంజాయ్ చేయండి

టిప్స్:

 • సజ్జ రొట్టేకి 1:1 రేషియో కప్ నీళ్ళు అయితే కప్ పిండి, కాని ఎప్పుడు ఓ పిడికెడు పిండి దగ్గరుంచుకోవడం మంచిది, పిండి జారు అయితే కలుపుకోవచ్చు
 • పిండిని వేడి మీదే బాగా ఎక్కువసేపు వత్తుకోవాలి లేదంటే విరిగిపోతాయ్ రొట్టెలు.
 • ఈ పిండిలో జిగురుండదు కాబట్టి ఎంత ఎక్కువసేపు వత్తుకుంటే అంత సాగుతుంది పిండి
 • పిండిని వత్తుకునేప్పుడు నిదానంగా వత్తుకోవాలి, పొడి పిండి ఎక్కువ చల్లి వత్తుకోండి రొట్టెలు.ఇవి మామూలు చపాతీల్లా వత్తుకోకూడదు.
 • ఇందులో సొరకాయ తురుము ఆప్షనల్. నచ్చకపోతే వదిలేయోచ్చు.