సెనగల పులావ్/చనా పులావ్

google ads

సెనగల పులావ్/చనా పులావ్

Author Vismai Food
Senagala pulav
“సెనగల పులావ్” ఇది నాకు చాలా ఇష్టం. చాలా త్వరగా అయిపోతుంది, కూరగాయలే అవసరం లేదు. ఎంతో రుచిగా ఉంటుంది.ఇది స్పెషల్ రోజుల్లో, వీకెండ్స్ లో ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చు.
దీనితో ఒక్క రైతా ఉంటె చాలు, ఆ పూట గడిచిపోతుంది.మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము. ఇది మా ముస్లిం ఫ్రెండ్స్ నేర్పిన రెసిపీ. దానిలో చిన్న చిన్న మార్పులతో మా స్టైల్ లో చేసుకున్నాం.
బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము చేసిన పులావ్ వాళ్లకిస్తే వాళ్ళు మమ్మల్ని అడిగి మా స్టైల్ లో చేయడం స్టార్ట్ చేసారు.ఇదే పులావ్ ని మటన్, చికెన్ కలిపి కూడా చేసుకోవచ్చు, చిన్న మార్పులతో.
అది నేను తప్పకుండా త్వరలో చెప్తా.ముఖ్యంగా ఇది రంజాన్ మాసం లో ఇఫ్తార్ పార్టీలకి చాలా ఎక్కువగా చేస్తుంటారు. అప్పటిదాకా ఉపవాసం ఉన్న వారికి కావాల్సిన పోషకాలని అందిస్తుంది వెంటనే అని.
కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే, కిచెన్లో ఎక్కువ టైం కూడా ఉండాల్సిన అవసరం లేదు.ఈ పులావ్ రుచంతా సెనగలు నానడం లో ఉంది. రాత్రంతా నానితే బియ్యం తో పాటు కుక్కర్ లో ఓ విసిల్ కే మెత్తగా ఉడుకుతుంది.
లేదంటే పలుకుగా తగులుతూనే ఉంటుంది. అంత రుచిగా ఉండదు. రాత్రంతా కుదరక పోయినా కనీసం 6-7 గంటలు వేడి నీళ్ళలో నానబెడితే మెత్తగా నానతాయ్.
ఈ పులావ్ నేను బాస్మతి బియ్యం తో చేశా మీరు కావాలంటే సోనా మసూరి బియ్యం తో కూడా చేసుకోవచ్చు, ఆ కొలతలు నేను రెసిపీ ఆఖరున ఉంచాను.

Tips

సెనగలు ఎంత నానితే అంత రుచి ఈ పులావ్ కి

Ingredients

 • 1 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది
 • ½ cup నల్ల సెనగలు (రాత్రంతా ననబెట్టినది)
 • 1 ఉల్లిపాయ
 • 4 పచ్చిమిర్చి చీలికలు
 • 2 tbsp పుదీనా తరుగు
 • 2 tbsp కొత్తిమీర తరుగు
 • cup పెరుగు కప్ చిలికినది
 • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
 • 1 tbsp నిమ్మరసం
 • ఉప్పు
 • ½ tbsp కారం
 • ½ tbsp గరం మసాలా పొడి
 • ¼ tbsp పసుపు
 • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
 • ½ tbsp షాహీ జీర
 • 4 యాలకలు
 • 4 లవంగాలు
 • 1 tbsp దాల్చిన చెక్కా
 • 1 బిరియానీ ఆకు
 • 1 అనాసపువ్వు
 • 1.½ cup నీళ్ళు (బాస్మతి బియ్యానికి)
 • 2.¼ cup నీళ్ళు (సోనా మసూరి బియ్యానికి)

Instructions

 • కుక్క ర్లో నూనె నెయ్యి వేడి చేసి షాహీ జీరా, లవంగాలు, యాలకలు, బిరియానీ ఆకు, అనసపువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాక వేపి సెనగలు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.
 • ఆ తరువాత పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లూలి ముద్దా, చిలికిన పెరుగు వేసి, పెరుగు మసాలల్లో కలిసిపోయి నూనె పైకి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
 • ఆ తరువాత నీళ్ళు పోసి, కొత్తిమీరా, పుదీనా తరుగు, నిమ్మరసం పిండి ఓ సారి కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద 1 విసిల్ రానిచ్చి, 15-20 నిమిషాల తరువాత అడుగు నుండి అట్లకాడతో కలుపుకోవాలి అంతే. నచ్చితే 2-3 బొట్లు ఖేవ్డా వాటర్ లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు.
 • ఇదే సోనా మసూరి బియ్యానికి గంట పాటు నానబెట్టిన బియ్యానికి 2.1/4 కప్స్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద 2 విసిల్స్ రానివ్వాలి. 20 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి.

Video

సెనగల పులావ్/చనా పులావ్

Author Vismai Food

Ingredients

 • 1 cup బాస్మతి బియ్యం (గంట నానబెట్టినది
 • ½ cup నల్ల సెనగలు రాత్రంతా ననబెట్టినది
 • 1 ఉల్లిపాయ
 • 4 పచ్చిమిర్చి చీలికలు
 • 2 tbsp పుదీనా తరుగు
 • 2 tbsp కొత్తిమీర తరుగు
 • cup పెరుగు కప్ చిలికినది
 • 1 tbsp అల్లం వెల్లూలి ముద్దా
 • 1 tbsp నిమ్మరసం
 • ఉప్పు
 • ½ tbsp కారం
 • ½ tbsp గరం మసాలా పొడి
 • ¼ tbsp పసుపు
 • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
 • ½ tbsp షాహీ జీర
 • 4 యాలకలు
 • 4 లవంగాలు
 • 1 tbsp దాల్చిన చెక్కా
 • 1 బిరియానీ ఆకు
 • 1 అనాసపువ్వు
 • 1.½ cup నీళ్ళు బాస్మతి బియ్యానికి
 • 2.¼ cup నీళ్ళు సోనా మసూరి బియ్యానికి

Instructions

 • కుక్క ర్లో నూనె నెయ్యి వేడి చేసి షాహీ జీరా, లవంగాలు, యాలకలు, బిరియానీ ఆకు, అనసపువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ చీలికలు వేసి మెత్తబడే దాక వేపి సెనగలు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.
 • ఆ తరువాత పచ్చిమిర్చి చీలికలు, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లూలి ముద్దా, చిలికిన పెరుగు వేసి, పెరుగు మసాలల్లో కలిసిపోయి నూనె పైకి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
 • ఆ తరువాత నీళ్ళు పోసి, కొత్తిమీరా, పుదీనా తరుగు, నిమ్మరసం పిండి ఓ సారి కలిపి కుక్కర్ మూత పెట్టి హై-ఫ్లేం మీద 1 విసిల్ రానిచ్చి, 15-20 నిమిషాల తరువాత అడుగు నుండి అట్లకాడతో కలుపుకోవాలి అంతే. నచ్చితే 2-3 బొట్లు ఖేవ్డా వాటర్ లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు.
 • ఇదే సోనా మసూరి బియ్యానికి గంట పాటు నానబెట్టిన బియ్యానికి 2.1/4 కప్స్ నీళ్ళు పోసి హై ఫ్లేం మీద 2 విసిల్స్ రానివ్వాలి. 20 నిమిషాల తరువాత సర్వ్ చేసుకోవాలి.

Tips

సెనగలు ఎంత నానితే అంత రుచి ఈ పులావ్ కి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top