కొన్ని రెసిపీస్ చిటికెలో అయిపోవడమే కాదు, తిన్న ప్రతీ సారి కడుపుతోపాటు మనసు నిండిపోతుంది. అలాంటి రేసిపీనే ఈ “సేమియా కర్డ్ బాత్”. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు, ఎండల కాలం లో, డిన్నర్ గా ఈ రెసిపీ పర్ఫెక్ట్. చేయడం కూడా సులభం.

కావలసినవి:

 • సేమియా- 120gms(1 కప్)
 • పెరుగు- 250gms
 • సాల్ట్- సరిపడా
 • ఓ కీర దోసకాయ తురుము
 • తాలింపులు-(ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు,మినపప్పు)1 tsp
 • మిరియాల పొడి-1/2tsp
 • కొత్తిమీర తరుగు- 2tbsps
 • కరివేపాకు- ఓ రెబ్బ
 • చిన్న అల్లం ముక్క-
 • పచ్చిమిర్చి- 1
 • జీడిపప్పు- 10-15
 • దానిమ్మ గింజలు- పిడికెడు
 • నీళ్ళు- 1 లీటర్
 • నూనె- 2tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. నీళ్ళు బాగా మసల కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియా వేసి జస్ట్ 30 సెకన్లు నుంచి ఓ నిమిషం పాటు ఉంచి వెంటనే వార్చేయండి
 2. ఇప్పుడు వార్చిన సేమియా పైన చల్లటి నీళ్ళు పోసి పూర్తిగా చల్లారనివ్వండి
 3. తాలింపు కోసం నూనె ని వేడి చేసి, అందులో జీడిపప్పు వేసి వేపుకుని,తీసి పక్కనుంచుకోండి.
 4. అదే నూనె లో తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి అల్లం తరుగు వేసి వేపుకుని చల్లార్చుకొండి.
 5. ఇప్పుడు కమ్మటి పెరుగుని బాగా చిలుక్కుని, కీర దోసకాయ తురుము వేసి, సాల్ట్ వేసి బాగా కలుపుకొండి.
 6. ఇప్పుడు చల్లార్చుకున్న సేమియా, చల్లార్చుకున్న తాలింపు, మిరియాల పొడి, దానిమ్మ గింజలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • మసల కాగుతున్న నీళ్ళలో మాత్రమే సేమియా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. సేమియా వేసి వండితే ముద్దవుతుంది. వేసి ఇంకా పలుకుండగానే వార్చి వెంటనే చన్నీళ్ళు పోయాలి. ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకూడదు.
 • కీర దోసకాయ వేస్తే రుచి బావుంటుంది, నచ్చకపోతే స్కిప్ చేయండి