“సేమియా కేసరి” ఇది అందరికి ఇష్టమే! చేయడము తిలికే, కానీ కొలతల్లో తేడ కారణంగా అంత రుచిగా రాకపోవడం, లేదా ముద్దగా అయిపోవడం జరుగుతుంది. అలా కాక ఈ కొలతల్లో చేస్తే చాలా తవరగా పక్కాగా చేసుకోవచ్చు. అందరికి నచ్చుతుంది.

కావలసినవి:

 • సేమియా- 1 కప్
 • నీళ్ళు- 2 కప్స్
 • పంచదార- 3/4 కప్
 • కుంకుమ పువ్వు- చిటికెడు
 • యలకలపొడి- 1 tsp
 • జీడిపప్పు- 3 tsps
 • ఎండు ద్రాక్ష- 2 tsps
 • నెయ్యి- 2 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. నెయ్యి కరిగించి జీడిపప్పు ని ఎర్రగా వేపుకోండి, జీడిపప్పు సగం పైన వేగాక అప్పుడు ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేపుకుని తీసి పక్కనుంచుకోండి
 2. ఇప్పుడు సేమియా వేసి మిగిలిన నెయ్యిలో ఎర్రగా లో-ఫ్లేం మీద ఎర్రగా వేపుకోండి. మాంచి గోల్డెన్-కలర్ రాగానే తీసి పక్కనుంచుకోండి
 3. ఇప్పుడు 2 కప్స్ నీళ్ళు పోసి అందులో కుంకుమ పువ్వు వేసి మరిగించండి. నీళ్ళు మరిగాక మాత్రమే వేయించిన సేమియా వేసి కలిపి హై-ఫ్లేం మీద 4 నిమిషాలు మరిగించి ఆ తరువాత మీడియం-ఫ్లేం మీద పూర్తిగా కుక్ చేసుకోండి.
 4. నీళ్ళు ఇంకా ఉన్నాయ్ అనగానే అప్పుడు పంచదార వేసి కలిపి దగ్గరపడనివ్వండి.
 5. దగరపడుతుండగా యాలకలపొడి, వేయించిన జీడిపప్పు, ద్రాక్ష వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోండి.
 6. నచ్చితే చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి

టిప్స్:

 • సేమియాని లో-ఫ్లేం మీద కలుపుతూ వేపితేనే ఎర్రగా ఈవెన్ గా వేగుతాయ్
 • నీళ్ళు మరిగాకా సేమియా వేస్తేనే ముద్దవదు, లేదంటే మెత్తగా ఉడికి చల్లారక సేమియా ముద్దగా అవుతుంది.
 • కుంకుమ పువ్వు వాడితే మాంచి కలర్ ఫ్లేవర్ ఇస్తుంది, లేనట్లైతే కలర్ వేసుకోండి