సొంటి కారం ఇది ప్రతీ ఇంట్లో ఉండాల్సిన పొడి. పసిపిల్లల నుండి పెద్దవారి వరకు వారానికి 3 ముద్దలు తింటే చాలు పొట్టని శుద్ధి చేయడానికి. ఎంతో గొప్ప గుణాన్ని చూపించగలిగిన పొడి ఇది. శరీరంలో పేరుకున్న వాతాన్ని తరిమికొట్టగల సామర్ధ్యం దీనికుంది. ఇది ఓ సీసాలో ఉంచుకుంటే కనీసం 6-7 నెలలు నిలవుంటుంది.

కావలసినవి:

 • సొంటి- 50 gms
 • జీలకర్ర్- 2 tsps
 • ఎండు మిర్చి-2
 • నెయ్యి- 1 tbsp
 • ఉప్పు- రుచికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. నెయ్యి కరిగించి సొంటి వేసి ఎర్రగా వేగి పొంగెంత వరకు మీడియం-ఫ్లేం మీద వేపుకోండి.
 2. సొంటి ఎర్రగా వేగాక జీలకర్ర ఎండు మిర్చి వేసి ఓ నిమిషం వేపి దింపి చల్లార్చుకోండి.
 3. చల్లారిన సొంతిని దంచండి, ఆ తరువాత మిక్సీ లో వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
 4. ఈ పొడి ని భోజనానికి ముందు ఓ చిటికెడు వేడి అన్నం లో నెయ్యేసుకుని మొదటి ముద్దగా వారానికి 3 సార్లు తినండి చాలు. పొట్ట శుద్ధి అవుతుంది.

టిప్స్:

 • ఈ పొడి లో ఎండుమిర్చి కి బదులు మిరియాలు కూడా వాడుకోవచ్చు.
 • వారానికి 3 ముద్దలా మోతాదు మించితే విరేచనాలు అవుతాయ్.