స్వీట్ బూంది ఇది ప్రేత్యేకించి ఆలయాల్లో ప్రసాదంగా ఇస్తుంటారు. రుచి కి లడ్డు కి దగ్గరగా ఉన్నా దీని రుచి దీనిదే దీనితో టైం పాస్ దీనిదే! ప్రేత్యేకించి పండుగలకి ప్రసాదంగా చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా స్వీట్ తినాలనిపించినా చేసుకుని డబ్బాలో ఉంచుకుంటే వారం పాటు తాజా గా ఉంటాయి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రావాలి రుచంటే, కొన్ని టిప్స్ ఉన్నాయ్ అవి జాగ్రత్తగా ఫాలో అవ్వండి!

కావలసినవి:

 • సెనగపిండి- 200 gms
 • పంచదార- 400 gms
 • నీళ్ళు- 200 ml
 • రెడ్ కలర్- ½ tsp
 • జీడిపప్పు- ¼ కప్
 • కిస్మిస్స్- ¼ కప్
 • పచ్చకర్పూరం- 1 చిటికెడు
 • యాలకలపొడి- ½ tsp
 • నూనె వేయించడానికి

విధానం:

Directions

0/0 steps made
 1. పంచదార లో నీళ్ళు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా హై ఫ్లేం మీద మరిగించుకోండి. ఓ తీగ పాకం వచ్చాకా దింపి పక్కనుంచుకోండి
 2. ఇప్పుడు సెనగపిండిలో తగినన్ని నీళ్ళు కలుపుకుంటూ గరిట జారుగా పిండి కలుపుకోవాలి. అంటే అట్ల పిండి కంటే కాస్త జారుగా ఉండాలి
 3. ఇప్పుడు సలసల మరుగుతున్న నూనె లో బూంది దూసే గరిటె పెట్టి దాని మీద పిండి పోసి నిదానంగా అట్లు పోసినట్లు పిండిని గరిట మీద తిప్పండి
 4. అప్పుడు బూంది ముత్యాల్లా కిందికి పడతాయ్. బూంది ని హై ఫ్లేం మీద ఎర్రగా వేపుకోవాలి
 5. బూంది దూసిన వెంటనే గరిట ని నీళ్ళలో పెట్టేయండి దాని వల్ల గరిటకున్న రంధ్రాలు శుభ్రపడతాయ్
 6. ఇప్పుడు బూంది ఎర్రగా కరకరలాడేట్టు వేపుకుని వెంటనే తీసి పాకం వేయండి
 7. పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసెయ్యండి
 8. ఇలాగే మిగిలిన సగం పిండి లో రెడ్ కలర్ వేసి కలుపుకుని బూంది దూసుకోండి, ఎర్రగా వేపి పంచదార పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసి పక్కనుంచుకోండి
 9. ఇప్పుదు నూనె లో జీడిపప్పు, కిస్మిస్స్ వేసి వేపి బూంది లో వేసుకోండి
 10. ఇప్పుడ పచ్చకర్పూరం, యలకలపొడి వేసి బాగా కలుపుకొండి. చల్లారక డబ్బాలో పెట్టుకోండి
 11. అంతే స్వీట్ బూంది రెడీ. ఇది మీకు కనీసం వారం పాటు నిలవుంటాయ్

టిప్స్:

 • బూంది ఎప్పుడు హై ఫ్లేం మీద మరుగుతున్న నూనె లోనే వేపుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ గా బూంది వస్తుంది
 • బూంది వేపుకోడానికి అడుగు లోతున్న ముకుడుంటే పర్ఫెక్ట్ గా రౌండ్ గా ముత్యాల్లా వస్తాయ్ బూంది
 • పిండి ని గరిట మీద పోసి నిదానంగా తిప్పండి గరిట ని తట్టకండి అల తడితే తోకలోస్తాయ్
 • బూంది ని కరకరలాడేట్టు వేపుకోవాలి
 • పాకం లో వేసి 30 సెకన్లు ఉంచి తీసెయ్యండి లేదంటే బూంది మెత్తబడుతుంది