హల్వా పూరి ఇది గుంటూరు జిల్లా లో చాలా ఫేమస్. ఎక్కువగా చేస్తారక్కడ. చేయడం చాలా ఈసీ. ఇవి కనీసం 3-4 రోజు నిలవుంటాయ్ కూడా. ఇది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది.

కావలసినవి:

హల్వా కోసం:

 • బొంబాయి రవ్వ- 250 gms
 • పంచదార- 200 gms
 • పాలు- 250ml
 • నీళ్ళు- 250 ml
 • యలకలపొడి- 1 tsp
 • నెయ్యి- 1 tbsp

పూరి కోసం:

 • మైదా/గోధుమ పిండి- 2 కప్స్
 • నీళ్ళు తగినన్ని
 • నెయ్యి- 1 tbsp
 • నూనె – వేయించడానికి సరిపడా

విధానం:

Directions

0/0 steps made
 1. 1 tbsp నెయ్యి కరిగించి అందులో రవ్వ వేసి 4-5 నిమిషాలు వేపి దిమ్పెసుకోండి
 2. ఇప్పుడు పాలు, నీళ్ళు పోసి మరిగించుకోండి, పాలు పొంగాక అప్పుడు పంచదార, యాలకలపొడి వేసి పంచదార కరిగి కాసేపు మరగనివ్వండి
 3. ఇప్పుడు రవ్వ పోసి బాగా కలుపుకుంటూ ముద్దగా అయ్యేదాకా దగ్గరపడనివ్వండి. తరువాత దింపి పూర్తిగా చల్లారనివ్వండి
 4. ఇప్పుదు మైదా లేదా గోధుమపిండి లో తగినన్ని నీళ్ళు పోసి బాగా మెత్తగా పిండి ని వత్తుకుని 1 tbsp నెయ్యి వేసి బాగా కలిపి 30 నిమిషాలు పిండి ని నాననివ్వండి
 5. 30 నిమిషాల తరువాత పెద్ద నిమ్మకాయ సైజు అంత ముద్ద పిండి ముద్దని తీసుకుని ప్లాస్టిక్ షీట్ మీద నూనె రాసి దాని మీద పిండిని కాస్త తట్టుకుని అందులో చల్లారిన హల్వా ముద్ద పెట్టి పిండి తో సీల్ చేసెయ్యండి
 6. సీల్ చేసాక పిండి ముద్దని హల్వా బైటికి రాకుండా చేత్తో అరిసెల అంత మందంగా పగుళ్ళు రాకుండా వత్తుకోండి
 7. తరువాత బాగా వేడెక్కిన నూనె లో వేసి ఎర్రగా వేపి తీసి ఓ జల్లెడలో వేసుకోండి, నూనె కాస్త దిగుతుంది.
 8. ఇవి వేడిగా చల్లగా ఎలా తిన్నా బాగుంటాయ్.

టిప్స్:

 • ఈ హల్వా లో తీపి కాస్త తక్కువగా వేస్తారు, మీకు నచ్చినట్లు వేసుకోండి
 • ఈ పూరీలు వేడి వేడి నూనె లో వేసి ఫ్రై చేయండి లేదంటే నూనె పీల్చేస్తాయ్