హేల్తీ పనీర్ బటర్ మసాలా

google ads

హేల్తీ పనీర్ బటర్ మసాలా

Author Vismai Food
paneer
“పనీర్ బటర్ మసాలా” అందరికి ఫేవరేట్. బటర్ నాన్- పనీర్ బటర్ మసాలా జోడి సూపర్ హిట్. ఎంత తిన్నా మొహం మొత్తదు, ఇంకా కావాలనిపిస్తుంది.
కానీ అంత బటర్, క్రీం వేసి చేసే పనీర్ బటర్ మసాలా తినాలంటే కాలరీస్ ఆలోచన.కానీ ఇలా చేస్తే ఏ భయం లేకుండా తృప్తిగా తినొచ్చు. హెల్త్ అనగానే రుచి లేకుండా చేస్తారు, ఆ తీరులో చేసేవి 2-3 రోజులు తిని ఆ తరువాత వద్దంటారు.
చేసే తీరులో చేస్తే అన్నీ అన్నీ వేళలా తినొచ్చు. ఈ పనీర్ బటర్ మసాలా లో బటర్, క్రీం, ఎక్కువెక్కువ కారాలు, ఉప్పు ఇవేవి ఉండవు. అయినా ఒరిజినల్ పనీర్ బటర్ మసాలా టేస్ట్ గారంటీ!కాబట్టి జిమ్ చేసే వారు, డైటింగ్ చేసే వారు హ్యాపీగా తినొచ్చు.
చాలా త్వరగా అయిపోతుంది కూడా. మీకు ఒరిజినల్ పనీర్ బటర్ మసాలా కావాలంటే ఆ రెసిపీ కూడా వెబ్ సైట్లో ఉంది చుడండి.

Tips

పనీర్ వేడి నీటిలో నానబెడితే సాఫ్ట్ అయి ముక్కకి ఫ్లేవర్స్ బాగా పడతాయ్
ఈ కూర కి నాటు టొమాటోలు వాడితే కూర పుల్లగా ఉంటుంది, ఈ కూర కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉన్న టొమాటోలు వాడితే పులుపుని తగ్గించడానికి ఉప్పు వేయాల్సి వస్తుంది. అందుకే హైబ్రిడ్ టొమాటోలు వాడుకోవడం బెస్ట్
ఈ కూరకి కష్మీరి కారం వాడితేనే ఘాటు ఫ్లేవర్ ఉంటుంది. ఈ కారంలో కారం తక్కువ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది.
ఈ కూర కారం గా ఘాటుగా మన కుర్మాలా ఉండదు, కమ్మగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.
కారాలు ఎక్కువగా వేస్తే దానికి తగినట్లు ఉప్పుని వాడుకోవాల్సివస్తుంది, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం లోని కొవ్వు త్వరగా కరగదు. అందుకే నేను చెప్పిన కొలతలలో చేయండి బెస్ట్ గా వస్తుంది.

Ingredients

 • 200 gms పనీర్
 • 2 హైబ్రీడ్ టొమాటోలు
 • 1 ఉల్లిపాయ (సన్నని తరుగు)
 • 2 tbsp జీడిపప్పు
 • 1 ఎండు మిర్చ
 • 1 వెల్లూలి
 • ¼ ఇంచ్ అల్లం
 • 1 లవంగాలు-
 • ¼ ఇంచ్ దాల్చిన చెక్క
 • 1 యాలకలు
 • 1 tbsp కష్మీరి చిల్లి పౌడర్
 • ½ tbsp ధనియాల పొడి
 • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
 • 1 tbsp కసూరి మేథి-
 • 2 tbsp నూనె
 • ½ tbsp తేనె
 • 600 ml నీళ్ళు

Instructions

 • పాన్ లో సగం నీళ్ళు పోసి అందులో టమాటో, జీడిపప్పు, వెల్లూలి, దాల్చిన చెక్క, అల్లం, లవంగం, ఎండు మిర్చి, ½ tsp కారం, ½ tsp కసూరి మేథి వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోండి.
 • గుజ్జు గా అయిన టమాటోలని మిక్సీ జార్ లో వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోండి
 • నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నూనె తక్కువగా ఉండటం వల్ల అడుగంటుతుంది, అందుకే కలుపుతూ వేపుకోవాలి.
 • ఉల్లిపాయా వేగాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి
 • ఆ తరువాత టమాటో పేస్టు, మిగిలిన నీళ్ళు, మిగిలిన కసూరి మేథి, సాల్ట్ వేసి హై ఫ్లేం మీద గ్రేవీ చిక్కబడేదాక ఉడికించాలి
 • గ్రేవీ చిక్కబడ్డాక గోరు వెచ్చని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టిన పనీర్ ముక్కలు, తేనే వేసి కలిపి 3-4 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోవాలి

Video

హేల్తీ పనీర్ బటర్ మసాలా

Author Vismai Food

Ingredients

 • 200 gms పనీర్
 • 2 హైబ్రీడ్ టొమాటోలు
 • 1 ఉల్లిపాయ సన్నని తరుగు
 • 2 tbsp జీడిపప్పు
 • 1 ఎండు మిర్చ
 • 1 వెల్లూలి
 • ¼ ఇంచ్ అల్లం
 • 1 లవంగాలు-
 • ¼ ఇంచ్ దాల్చిన చెక్క
 • 1 యాలకలు
 • 1 tbsp కష్మీరి చిల్లి పౌడర్
 • ½ tbsp ధనియాల పొడి
 • ½ tbsp వేయించిన జీలకర్ర పొడి
 • 1 tbsp కసూరి మేథి-
 • 2 tbsp నూనె
 • ½ tbsp తేనె
 • 600 ml నీళ్ళు

Instructions

 • పాన్ లో సగం నీళ్ళు పోసి అందులో టమాటో, జీడిపప్పు, వెల్లూలి, దాల్చిన చెక్క, అల్లం, లవంగం, ఎండు మిర్చి, ½ tsp కారం, ½ tsp కసూరి మేథి వేసి టొమాటోలు మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోండి.
 • గుజ్జు గా అయిన టమాటోలని మిక్సీ జార్ లో వేసి మెత్తని వెన్నలాంటి పేస్టు చేసుకోండి
 • నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి లైట్-గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నూనె తక్కువగా ఉండటం వల్ల అడుగంటుతుంది, అందుకే కలుపుతూ వేపుకోవాలి.
 • ఉల్లిపాయా వేగాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేపుకోవాలి
 • ఆ తరువాత టమాటో పేస్టు, మిగిలిన నీళ్ళు, మిగిలిన కసూరి మేథి, సాల్ట్ వేసి హై ఫ్లేం మీద గ్రేవీ చిక్కబడేదాక ఉడికించాలి
 • గ్రేవీ చిక్కబడ్డాక గోరు వెచ్చని నీళ్ళలో 15 నిమిషాలు నానబెట్టిన పనీర్ ముక్కలు, తేనే వేసి కలిపి 3-4 నిమిషాలు ఉడికించి దిమ్పెసుకోవాలి

Tips

పనీర్ వేడి నీటిలో నానబెడితే సాఫ్ట్ అయి ముక్కకి ఫ్లేవర్స్ బాగా పడతాయ్
ఈ కూర కి నాటు టొమాటోలు వాడితే కూర పుల్లగా ఉంటుంది, ఈ కూర కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉన్న టొమాటోలు వాడితే పులుపుని తగ్గించడానికి ఉప్పు వేయాల్సి వస్తుంది. అందుకే హైబ్రిడ్ టొమాటోలు వాడుకోవడం బెస్ట్
ఈ కూరకి కష్మీరి కారం వాడితేనే ఘాటు ఫ్లేవర్ ఉంటుంది. ఈ కారంలో కారం తక్కువ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది.
ఈ కూర కారం గా ఘాటుగా మన కుర్మాలా ఉండదు, కమ్మగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.
కారాలు ఎక్కువగా వేస్తే దానికి తగినట్లు ఉప్పుని వాడుకోవాల్సివస్తుంది, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం లోని కొవ్వు త్వరగా కరగదు. అందుకే నేను చెప్పిన కొలతలలో చేయండి బెస్ట్ గా వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating
Scroll to Top