హైదరాబాదీ బిర్యానీ వరల్డ్ ఫేమస్! అసలు హైదరాబాద్ కి బిర్యానీ రుచి చూపించింది ఇరానీలే అయినా వాళ్ళకంటే మనవాళ్ళే చాలా బాగా చేస్తున్నారు, తెలుగు వారి మసాలాల కలయికతో. ఈ బిర్యానీ ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా రెస్టారంట్ స్టైల్ టేస్ట్ వచ్చి తీరుతుంది, ఈ కొలతలు సరిగ్గా పాటిస్తే! కాబట్టీ కాస్త జాగ్రతగా కొలతలు చుడండి! చివర్న ఉండే టిప్స్ ఫాలో అవ్వండి.

కావలసినవి:

కూరగాయల మసాలాల కోసం:

 • బంగాళా దుంప- 1 (చెక్కు తీసి ముక్కలు గా చేసుకున్నది)
 • కేరట్- 1
 • ఫ్రెంచ్ బీన్స్- 6
 • కాలీఫ్లవర్- 10-15 ముక్కలు
 • పచ్చి బటానీ- పిడికెడు(30 నిమిషాలు వేడి నీటి లో నానా బెట్టినది)
 • పసుపు- ¼ చెంచా
 • సాల్ట్- ½ tsp
 • పెరుగు- ½ కప్
 • వేయించిన ఉల్లిపాయలు- ¼ కప్
 • పచ్చిమిర్చి చీలికలు – 2
 • ఓ నిమ్మకాయ రసం
 • అల్లం వెల్లూలి పేస్టు- 1 tbsp
 • కొత్తిమీర తరుగు- 2 tbsps
 • పుదినా తరుగు- 2 tbsps
 • గరం మసాలా- ½ tsp
 • షాహీ జీరా- 1 tsp
 • యాలకలు- 4
 • లవంగాలు
 • బిరియాని ఆకు- 1
 • సాల్ట్
 • కారం- 1 tbsp
 • పసుపు- ¼ tsp
 • వేయించిన జీలకర్ర పొడి- 1 tsp
 • ధనియాల పొడి- 1 tsp
 • నూనె – 2 tbsps
 • నెయ్యి 2 tbsps

బిర్యాని కోసం:

 • బాసుమతి బియ్యం- 1.5 కప్స్( 325 gms)
 • షాహీ జీర- 1 tsp
 • అల్లం వెల్లులి పేస్టు- 1 tbsps
 • సాల్ట్-2 tsps
 • దంచిన యలకలు- 4
 • ఓ నల్ల యాలాక
 • లవంగాలు- 5
 • దాల్చిన చెక్క- 2 ఇంచులు
 • ఓ అనాసపువ్వు
 • ఓ బిరియాని ఆకు
 • ½ చెక్క నిమ్మరసం
 • 1 పచ్చిమిర్చి చీలిక
 • నెయ్యి- 3 tbsps
 • 50ml అన్నం ఉడికించిన నీరు
 • గరం మసాలా- ½ చెంచా
 • కొత్తిమీర తరుగు- 2 tbsps
 • వేయించిన ఉల్లి తరుగు- 2 tbsps
 • కుంకుమ పువ్వు పాలు- 2 tbsps
 • వేయించిన ఉల్లిపాయ తరుగు- 2 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. ఓ లీటర్ నీళ్ళని తెర్ల కాగనివ్వండి. అందులో చెక్కు తీసుకున్న ఆలూ ముక్కలు, కేరట్ ముక్కలు, ఇంచ్ సైజు తరుక్కున ఫ్రెంచ్ బీన్స్ , కాలీఫ్లవర్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి 70% కుక్ చేసుకోండి హై ఫ్లేం మీద.
 2. 70% అంటే మరో 5 నిమిషాలు కుక్ చేస్తే పూర్తిగా కుక్ అవుతుంది అన్న స్టేజి. అప్పుడు కురగాయలని వడకట్టి మరో గిన్నె లోకి తీసుకోండి. వెంటనే చల్లటి నీళ్ళు పోసేయ్యండి. దీని వల్ల ఇంకా ఉడకదు.
 3. ఇప్పడు అడుగు మందంగా ఉన్న గిన్నె లో మాత్రమే ఉడికిన్చుకున్న కాయకూర ముక్కలు, నీళ్ళు ఓంపేసి వేసుకోండి. ఇందులో 30 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టిన తాజా బటాని వేసుకోండి.
 4. ఇప్పుడు ఇందులో కమ్మటి మీగడ పెరుగు, యాలకలు, లవంగాలు, షాహీ జీరా, బిరియానీ ఆకు, నిమ్మరసం, వేయించిన ఉల్లిపాయ తరుగు,కారం, ఉప్పు, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి , నెయ్యి, నూనె వేసి ముక్కలు చిదురవ్వకుండా బాగా పట్టించి, పక్కనుంచండి.

ఇప్పుడు బిరియాని కోసం:

Directions

0/0 steps made
 1. 2 లీటర్ల నీళ్ళని మరిగించండి. మరుగుతున్న నీళ్ళలో షాహీ జీరా, దంచిన యాలకలు, లవంగాలు, అనాస పువ్వు, బిరియాని ఆకు, దాల్చిన చెక్క, నల్ల యాలక, అల్లం వెల్లులి పేస్టు, పచ్చిమిర్చి చీలికలు, సాల్ట్ వేసి నీళ్ళని తెర్ల కాగనివ్వండి.
 2. నీళ్ళు తెర్ల కాగుతున్నప్పుడు మాత్రమే గంటపాటు నానబెట్టుకున్న 1.5 కప్స్ బాస్మతి బియ్యం వేసి హై-ఫ్లేం మీద 70% కుక్ చేసుకోండి.
 3. అన్నం ఉడుకుతున్నప్పుడు ½ చెక్క నిమ్మరసం పిండుకోండి. దీని వల్ల అన్నం తెల్లగా ఉడుకుతుంది.
 4. అన్నం 70% ఉడకడం అంటే పట్టుకుంటే సగం పైన ఉడికుండాలి, కాని ఇంకాస్త పలుకుండాలి. అలాంటి స్టేజి లో చిల్లుల గరిటతో కొంత అన్నాన్ని వడకట్టి మసాలాలు కలిపి ఉంచుకున్న కూరగాయ ముక్కలపైన 2 లేయర్లుగా వేసుకోండి.
 5. అన్నాన్ని మరో 5 నిమిషాలు హై-ఫ్లేం ఉడికిస్తే అది 80% కుక్ అవుతుంది. అప్పుడు కొంత అన్నాన్ని మరో ఓ లేయర్ వేసుకోండి.
 6. మిగిలిన అన్నాన్ని ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే 90% కుక్ అవుతుంది. అప్పుడు మిగిలిన అన్నాన్ని అంతా గరిట తో తీసి వడకట్టి మరో లేయర్ గా సర్దుకోండి.
 7. ఇప్పుడు అన్నం ఉడికిన్చుకున్న నీళ్ళని కేవలం 50ml తీసుకుని బిరియాని రైస్ అంచుల వెంట పోసుకోండి. ఇంత కంటే ఎక్కువగా పోయకండి.
 8. బిర్యానీ రైస్ మీద 2 tbsps చిటికెడు కుంకుమపువ్వు వేసి నానబెట్టిన పాలు, వేయించిన ఉల్లిపాయ, గరం మసాలా, కొత్తిమీర తరుగు, 3 tbsps నెయ్యి వేసి పైన టిష్యు నాప్కిన్స్ వేసి పైన కాసిని నీళ్ళు చల్లి గట్టిగా మూత పెట్టెయ్యండి. టిష్యూ నాప్కిన్స్ పైన నీళ్ళు చల్లితే ధం ఇక బైటికి పోదు.
 9. ఇప్పుడు బిరియానిని 8 నిమిషాలు హై- ఫ్లేం మీద 7 నిమిషాలు లో-ఫ్లేం మీద ధం చేసుకుని స్టవ్ ఆపేసి 15 నిమిషాలు ఆలాగే వదిలేయండి.
 10. ఆ తరువాత అడుగు నుండి కలుపుకోండి. వేడి వేడిగా మిర్చి కా సాలన్ తో సర్వ్ చేయండి. అందరికి నచ్చుతుంది.

టిప్స్:

 • బిరియానీ తయారీకి ముందే ఉల్లిపాయని చీలికలు గా కోసీ కాస్త ఉప్పేసి ఎర్రగా వేపుకుని రెడీ చేసుకోండి.
 • కూరగాయలని మరీ ఎక్కువగా కుక్ చేసుకుంటే బిర్యానీ తయారయ్యేపాటికి చిదురైపోతాయ్. కాలీఫ్లవర్ కాస్త పెద్ద ముక్కలు వేసుకోండి.
 • బాస్మతీ బియ్యం కచ్చితంగా సంవత్సరం కంటే పాత బియ్యం అని అడిగి తెచ్చుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ గా ముద్ద కాకుండా బిర్యానీ వస్తుంది.
 • ఈ బిర్యానీ కి కచ్చితంగా అడుగు మందంగా ఉన్న బౌల్ ఉండి తీరాలి, లేదంటే అడుగు పటేస్తుంది.
 • బిర్యానీ కి రైస్ ఉడుకుతున్నప్పుడు సాల్ట్ కొంచెం ఎక్కువుంటేనే బియ్యానికి ఉప్పు పడుతుంది.
 • బియ్యం ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం పిండితే అన్నం తెల్లగా ఉడుకుతుంది.
 • గరం మసాలాలు మాములువి కాకుండా మేము చేఇస్న గరం మసాలా వాడుకోండి చాల ఘాటుగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. రెసిపీ ఛానల్ లో ఉంది చుడండి.
 • మరీ ఎక్కువ ధం చేస్తే అడుగుపడుతుంది…తక్కువ చేస్తే అడుగు చెమ్మగా ఉంటుంది. ఇంకా నీళ్ళు ఎక్కువ పోసినా చెమ్మగానే ఉంటుంది బిర్యానీ అడుగునా.