మసాలా పేస్టు కోసం

 • ఓ పెద్ద ఉల్లిపాయ తరుగు
 • 3-4 పచ్చిమిర్చి
 • 1tbsp కర్బూజా గింజలు
 • 2 చెంచాల జీడిపప్పు
 • 1 చెంచా గసగసాలు

కూర కోసం

 • అర కప్ నూనె
 • 1 చెంచా అల్లం వెల్లులి పేస్టు
 • 2 టమాటో ల పేస్టు
 • ఉప్పు
 • అర చెంచా పసుపు
 • 1/2 కిలో చికెన్ (గంట సేపు రెండు చెంచాల ఉప్పు వేసిన నీటిలో నానబెట్టినది)
 • ఓ చెంచ ధనియాల పొడి
 • 1/2 చెంచ గరం మసాల
 • ఓ చెంచ వేయించిన జీల కర్ర పొడి
 • ఓ పెద్ద చెంచా కారం
 • 1/2 లీటర్ నీళ్ళు
 • రెండు రెబ్బల కరివేపాకు
 • సగం కట్ట కొత్తిమీర

తయారీ విధానం:

Directions

0/0 steps made
 1. మిక్సి జార్లో మసాలా వేసినదినుసులన్ని వేసి నీళ్ళతో మెత్తని పేస్టు చేసుకోండి.
 2. అడుగు మందంగా ఉన్న బాండి లో నునే పోసుకుని మసాలా పేస్టు వేసుకుని మీడియం ఫ్లేం మీద బాగా కలుపుతూ 80 ఫ్రై చేసుకోండి.
 3. ఇప్పుడు అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లులి ముద్ద వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి
 4. ఇప్పుడు టమాటో పేస్టు, ఉప్పు, పసుపు వేసి నూనె పైకి తేలేదాకా వేయించుకోండి.
 5. నునే పైకి తేలాక చికెన్ వేసి మసాలాలు బాగా పట్టించి ౩-4 నిమిషాలు హై ఫ్లేం మీద ఫ్రై చేసుకోండి.
 6. ఆ తరువాత ధనియాలపొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోండి.
 7. ఇప్పుడు అర litre నీళ్ళు పోసుకుని, సన్నని సెగ మీద మూత పెట్టి 30 నిమిషాలు ఉడికించుకోండి.
 8. దింపే ముందు ఓ రెబ్బ కరివేపాకు, కొత్తిమీర చల్లుకోండి.

టిప్స్:

 • చికెన్ ఉప్పు వేసిన నీటిలో నానబెట్టడం వలన ముక్క చాల సాఫ్ట్ గా జూసీ గా ఉంటుంది.
 • ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ మరీ ఎక్కువగా కలిపితే చిదురవుతుంది.
 • ఉప్పు నీటిలో నాన బెట్టిన చికెన్ కి ఉప్పు ఎక్కువగా అవసరం పడదు చూసుకుని వేసుకోవాలి.
 • నాన్ వెజ్ కి నూనె ఎక్కువుంటేనే రుచి.
 • కూరని ఎంత ఎక్కువ టైం తీసుకుని వండితేనె రుచి.