ఆవకాయ పచ్చడి అంటే అందరికీ ప్రాణమే వేడి వేడి అన్నం లో కలుప్కుని తింటే ఆ రుచి గురించి ప్రేత్యేకంగా చెప్పాలా! సహజంగా మన తెలుగు వారికి కరం అంటే ప్రాణం కాని చైనీస్ ఫ్రైడ్ రైస్ చప్పగా ఉంటుంది చాలా మందికి నచ్చాదు, కాని ఇలా చేస్తే ఇంకేం మాట్లాడకుండా ఇష్టంగా తినేస్తారు! ఒక్కసారి దీని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు!

కావలసినవి:

 • నూనె- 3 tbsps
 • ఉల్లిపాయ- చిన్న తరుగు
 • కేరట్- 1/4కప్
 • ఫ్రెంచ్ బీన్స్ – 3 సన్నని తరుగు
 • క్యాబేజీ- 1/4 కప్
 • సోయా సాస్- 1 tbsps
 • రెడ్ చిల్లి సాస్- 1 tbsp
 • టమేటా సాస్- 1 tsp
 • మామిడికాయ పచ్చడి- 1/4 కప్
 • సాల్ట్
 • 1 కప్ పొడి పొడి గా వండుకున్న అన్నం
 • ఉల్లి కాడలు- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. నూనె వేడి చేసి ఉల్లిపాయ, కేరట్, బీన్స్, క్యాబేజీ వేసి హై-ఫ్లేం మీద 30 సెకన్లు వేపుకోండి. పూర్తిగా వేపుకోకూడదు
 2. ఇప్పుడు సోయా సాస్, చిల్లి సాస్, టమాటో సాస్ వేసి 30 సెకన్లు హై-ఫ్లేం మీద ఉడకనివ్వండి
 3. ఇప్పుడు మామిడికాయ పచ్చడి, కొద్దిగా సాల్ట్, ఉడికించిన అన్నం వేసి బాగా పట్టించండి
 4. దింపే ముందు ఉల్లి కాడల తరుగు వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే

టిప్స్:

 • చైనీస్ ఎప్పుడూ హై ఫ్లేం మీదే చేయాలి అప్పుడే దానికి మంచి రుచోస్తుంది
 • ఉప్పు చాల కొద్దిగా వేసుకోండి సాస్ల లో, ఇంకా పచ్చడిలో ఉంటుంది కాబట్టి