హలో ఫూడీస్…ఇప్పుడు మీరు ది బెస్ట్ ఐస్ క్రీం తెలుసుకోబోతున్నారు. చాల రుచిగా ఉంటుంది. అందరికి చాల నచ్చి తీరుతుంది. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు స్మూత్ ఐస్ క్రీం వస్తుంది. ఇందులో ఎలాంటి ఫాన్సీ ఐటమ్స్ లేవు అన్ని అడుబాతులో ఉండేవే!

కావలసినవి:

 • కస్టర్డ్ పౌడర్- 2 tbsps
 • పంచదార – 1/2 కప్
 • పాలు- 1/2 litre
 • వనీల ఎసెన్స్- 1 tsp
 • తూటి ఫ్రూటి- 1/4 కప్
 • ఫ్రెష్ క్రీం- 1/2 కప్

తయారీ విధానం:

Directions

0/0 steps made
 1. చిక్కటి పాలని 3-4 నిమిషాలు మరిగించాక పంచదార వేసి సన్నని సెగ మీద 4-5 పొంగులు రానివ్వండి
 2. 1/4 కప్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని మరో 3-4 నిమిషాల పాటు చిక్కపడే దాక బాగా కలుపుతూనే ఉండండి.
 3. చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి వనీల ఎసెన్స్ వేసి బాగా కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వండి
 4. చల్లారక ఎయిర్ టైట్ డబ్బా లో పోసి ఫ్రిజ్ లో 4-5 గంటల పాటు గట్టి పడేదాకా ఉంచండి
 5. గట్టి పడ్డాక మిక్షి జార్ లో వేసి 1/2 కప్ ఫ్రెష్ క్రీం వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోండి 3-4 నిమిషాల పాటు. *క్రీం లేకపోతే వదిలేయండి. హ్యాండ్ బ్లేన్దర్ ఉన్నవాళ్లు దానితోనే బ్లెండ్ చేసుకోండి.
 6. ఇప్పుడు ఎయిర్ టైట్ ఫ్రీజర్ సేఫ్ బౌల్ లో పోసి నచ్చితే పైన కొన్ని తూటి ఫ్రూటి వేసుకుని కనీసం 12 గంటలు లేదా రాత్రంతా ఫ్రీజర్ లో హై టెంపరేచర్ మీద ఉంచండి.
 7. 12 గంటల తరువాత తీస్తే పర్ఫెక్ట్ క్రీమీ ఐస్ క్రీం రెడీ

టిప్స్:

 • మీకు కస్టర్డ్ పౌడర్ వేరే ఫ్లెవర్స్ లో ఉంటె అది కూడా ట్రై చేయండి
 • ఫ్రెష్ క్రీం ఉంటె ఐస్ క్రీం సాఫ్ట్ గా వస్తుంది
 • ఐస్ క్రీం ఫ్రీజర్ లో హై టెంపరేచర్ మీద ఫ్రీజ్ చేసుకోండి