ఈ మిల్క్ షేక్ చేయడం చాల తేలికా అలాగే ఎంతో ఆరోగ్యం. ఇది పిల్లలు, పెద్దలు, గర్భవతులు, బ్లడ్, ఐరన్  తక్కువున్నవారు రోజూ ఈ మిల్క్ షేక్ తాగితే చక్కటి గుణం కనిపిస్తుంది.

కావలసినవి:

 • 8 బాదాం పప్పులు
 • 15 జీడిపప్పు
 • 4 అన్జీర్
 • 5 పండు కర్జూరం
 • వేడి నీళ్ళు కొద్దిగా
 • 1/2 లీటర్ పాలు
 • 1/4 కప్ పంచదార
 • 1/4 tsp రోజ్ వాటర్

విధానం:

Directions

0/0 steps made
 1. డ్రై ఫ్రూట్స్ అన్ని వేడి నీటిలో వేసి గంటకు పైగా నానబెట్టుకోండి
 2. డ్రై ఫ్రూట్స్ మెత్తబడ్డాక మిక్సీ లో 2 నిమిషాలు పాటు కాస్త పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోండి
 3. ఇప్పుడు 1/2 లీటర్ కాచి చల్లార్చిన చల్లటి పాలు, పంచదార, రోజ్ వాటర్ వేసుకుని 2-3 నిమిషాలు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకుని సర్వ్ చేసుకోండి.

టిప్స్:

 • ఇది మీరు వేడి పాలతో కూడా చేసుకోవచ్చు
 • చల్లగా చేసుకోదలిస్తే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు
 • రోజ్ వాటర్ కి బదులు యాలకల పొడి వేసుకోవచ్చు, పంచదార కి బదులు తేనే వాడుకోవచ్చు