డ్రై ఫ్రూట్ లడ్డూ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది పేరుకు స్వీట్ కాని ఇందులో ఎక్కడా పంచదార కాని బెల్లం కాని వాడలేదు, అవసరమూ లేదు. ఇది పిల్లలకి, గర్భవతులకి, పెద్దలకి, ఇంకా చెప్పలంటే టైం పాస్ గా కూడా చాల మంచి స్వీట్ ఇది. టేస్ట్ చాల బావుంటుంది, అచ్చం స్వీట్ షాప్స్ లో లాంటి రుచి గ్యారంటీ! ఇవి మీకు కనీసం 10 రోజుల పైనే నిలవుంటాయ్.

కావలసినవి:

 • పండు కర్జూరం- 1 కప్
 • బాదాం పలుకులు- 1/4 కప్
 • జీడిపప్పు పలుకులు- 1/4 కప్
 • పిస్తా పలుకులు -1/4 కప్
 • కర్బూజా గింజలు- 1/4 కప్
 • గొంద్- 2 tbsps
 • గసగసాలు- 1 tbsp
 • ఎండు కొబ్బరి పొడి- 1/4 కప్
 • యలకల పొడి- 1/2 tsp
 • జాజి కాయ పొడి- 1/4 tsp
 • నెయ్యి- 2 tbsps

విధానం:

Directions

0/0 steps made
 1. కాస్త నెయ్యి కరిగించి అందులో గొంద్ వేసి మీడియం ఫ్లేం మీద వేపి తీసి పక్కనుంచుకోండి
 2. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి జీడి పప్పు, బాదం, పిస్తా, కర్బూజా గింజలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి చల్లార్చుకోండి.
 3. ఇప్పుడు గసగసాలు వేసి కాస్త రంగు మారగానే తీసి బాదాం గింజల్లో వేసుకోండి.
 4. అలాగే ఎండు కొబ్బరి పొడి వేసి లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి వేయించుకున్నపప్పులలో వేసుకోండి.
 5. ఇప్పుడు గొంద్ ని అప్పడాల కర్ర తో మెత్తగా అయ్యేదాక రోల్ చేసుకోండి, తరువాత పప్పులలో కలుపుకొండి
 6. ఇప్పుడు పండు కర్జూరం జర లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి
 7. బాండీ లో 1 tsp నెయ్యి వేడి చేసి అందులో కర్జూరం , వేయించుకున్న పప్పులు వేసి బాగా కలిసేట్లు ఓ నిమిషం పాటు లో-ఫ్లేం మీద కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి.
 8. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేట్లులకి నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకొండి. పూర్తిగా చల్లారాక డబ్బా లో పెట్టుకుంటే కనీసం 10 రోజులు నిలవుంటాయ్.

టిప్స్:

 • గొంద్ అన్ని ఆయుర్వేదిక్ షాప్స్ లోనూ పచారి కొట్లలోనూ కచ్చితంగా గోరుకుతుంది. తప్పక వాడుకోండి, ఎంతో ఆరోగ్యం, ఎదిగే పిల్లలకి, నడుము నొప్పి ఉన్న వారికి, డెలివరీ అయ్యాక, త్వరగా కోలుకోడానికి ఎంతో మేలు చేస్తుంది ఈ గొంద్ బంక. దొరకకపోతే వదిలేయండి
 • డ్రై ఫ్రూట్స్ ఏది మరీ ఎర్రగా వేపకండి చల్లరేపాటికి నల్లగా అయిపోతాయి.
 • కర్జూరం వేసి వేయగానే డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రీ చేసుకోండి కాస్త ఎక్కువగా వేగినా గట్టి పడుతుంది కర్జూరం.
 • మీకు నచ్చితే ఎండు ద్రాక్ష కూడా వాడుకోవచ్చు.