కొబ్బరి చట్నీ దక్షినాది రాష్టారాల్లో తప్పనిసరి, ప్రతీ రోజు తినే ఇడ్లి, అట్టు, వడలకి. అందరూ చేస్తారు కాని ఒకరికోచ్చిన రుచి మరొకరికి రాదు. హోటల్స్ లో రుచి చాలా బాగుంటుంది, మాకు రాదు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు రాదు కచ్చితంగా వచ్చి తీరుతుంది మా పద్దతిలో చేస్తే. ఈ చట్నీకి ప్రేత్యేకమైన మార్పులేమీ లేకపోయినా వేసే కొలతలు తీరు ని బట్టి రుచి చాలా మారుతుంది. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ చట్నీ.

కావలసినవి:

 • పచ్చికొబ్బరి ముక్కలు – 1 చిన్న కాయవి
 • పచ్చిమిర్చి-5
 • అల్లం తరుగు- ½ ఇంచ్
 • వెల్లూలి- 4
 • కరివేపాకు- రెండు రెబ్బలు
 • ఉప్పు
 • పచ్చి సెనగపప్పు- 1 tbsp(30 నిమిషాలు నానబెట్టుకున్నది)

తాలింపు కోసం:

 • నూనె-2 tsps
 • ఆవాలు- ½ tsp
 • జీలకర్ర- ½ tsp
 • ఎండుమిర్చి- 2
 • కరివేపాకు- 1 రెబ్బ

విధానం:

Directions

0/0 steps made
 1. కొబ్బరి ముక్కలని కడిగి మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే మిగిలినవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని మెత్తని పేస్టు గా చేసుకోండి
 2. నూనెని వేడి చేసి తాలింపు దినుసులన్నీ వేసి చట్నీలో కలిపెసుకోవడమే.

టిప్స్:

 • సెనగపప్పు బాగా నానితేనే రుచి, లేదంటే పలుకుగా తగులుతుంది, బాగా నానితే క్రీమీ గా ఉంటుంది చట్నీ
 • కరివేపాకు ముదురుది వేసుకుంటే మంచి సువాసనుంటుంది చట్నీకి
 • పచ్చిమిర్చి వేపక్కర్లేదు, మీకు నచ్చితే వేపుకోండి
 • చింతపండు అవసరం లేదు, చింతపండు వేస్తే పులుపోస్తుంది, ఈ చట్నీ కమ్మగా ఉంటుంది
 • ఇంగువతో తాలింపు వేయకండి, వేస్తే ఫ్లేవర్స్ అన్నీ ఇంగువ డామినేట్ చేస్తుంది