చికెన్ మాసాలా కోసం కావలసినవి:

  • అర కిలో చికెన్
  • 1 టీ స్పూన్ షా జీర
  • 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి ముద్దా
  • 1/4 కప్ వేయించిన ఉల్లి తరుగు
  • 2 చెంచాల పుదినా
  • రెండు చెంచాల కొత్తిమీర
  • 2 చెంచాల నెయ్యి
  • ఓ నిమ్మకాయ రసం
  • 1 టీ స్పూన్ కారం
  • 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1/2 టీ స్పూన్ గరం మసాలా
  • 1/4 చెంచా పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • 250ml పెరుగు
  • 1 బిరియాని ఆకు
  • 2 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క

బిర్యానీ కోసం కావలసినవి

  • 2 లీటర్ల నీళ్ళు
  • 5 యాలకలు
  • 1 ఇంచ్ దాల్చిన చెక్క
  • 6 లవంగాలు
  • 1 టీ స్పూన్ షా జీరా
  • 1 బిరియాని ఆకు
  • 1 పెద్ద చెంచా అల్లం వెల్లులి ముద్దా
  • 1 పెద్ద చెంచా సాల్ట్
  • 1.5 కప్స్ బాస్మతి బియ్యం (225 గ్రాములు)

బిర్యానీ ధం కోసం కావలసినవి

  • 2 టీ స్పూన్స్ కొత్తిమీర తరుగు
  • 1/4 కప్ నెయ్యి

తయారీ విధానం:

Directions

0/0 steps made
  1. అర కిలో లేత చికెన్ లో చికెన్ మసాలా కోసం సిద్ధంగా ఉంచుకున్న పదార్ధాలన్నీ వేసి బాగా పట్టించండి.
  2. ఇది సుమారు 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి. రాత్రంతా ఉంచితే ముక్క బాగా జూసీ గా చాల బావుంటుంది. ఫ్రిజ్ అందుబాటులో లేని వారు బయటే రెండు గంట పాటు ఉంచండి.
  3. రెండు లీటర్ల నీళ్ళని మరిగించి అందులో బిరియాని సామానంత వేసుకోండి. నీళ్ళు బాగా మరిగాక అప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యని వేసి కేవలం పెద్ద మంట మీదే 70% కుక్ చేసుకోండి. బియ్యం సగం పైన ఉడికితే అది 70% ఆని గుర్తు. ఇంకా కాస్త పల్కుంటుంది అని గుర్తుంచుకోండి.
  4. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నానబెట్టిన చికెన్ ఆ పైన సగం పైన ఉడికిన బసమతి బియ్యాన్ని మాసాలాల తో పాటు పూర్తిగా వడకట్టి చికెన్ పైన వేసుకోండి.
  5. ఇప్పుడు అన్నం పైన కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, కుంకుమ పువ్వు నీళ్ళు వేసి టిష్యూ పేపర్స్ తో కవర్ చేసి ఆవిరి బయటకి పోకుండా గట్టి మూత పెట్టెయ్యండి.
  6. ఇప్పుడు 8 నిమిషాలు మీడియం ఫ్లేం మీద, 7 నిమిషాలు సన్నని మంట మీద ధం చేసుకోండి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు కదపకండి.
  7. ఆ తరువాత అట్లకాడ తో అడుగు నుండి కదపండి.
  8. నచ్చితే ఓ చెంచా రోజ్ వాటర్ వేసుకోండి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది.

టిప్స్:

  • బిరియాని ఎప్పుడు చేసిన సరిగ్గా రావాలంటే కచ్చితంగా సంవత్సరం కంటే పాతః బియ్యని వాడుకోవాలి
  • గరం మసాలా విస్మయ్ ఫుడ్ స్పెషల్ మసాలా వాడుకోండి చాల మంచి ఫ్లేవర్ వస్తుంది
  • చికెన్ కచ్చితంగా రెండు గంటలు నానా బెట్టి తీరాలి. బిరియానికి కి ఎప్పుడు రైస్ ఎంతైతే చికెన్ కుడా అంతే ఉండాలి కాని నేను డబల్ తీసుకున్నాను ప్రతే ఏఓఆఱీఈ ముక్కలు రావాలని.
  • అడుగు మందంగా ఉన్న గిన్నె కచ్చితంగా వాడుకోవాలి లేదంటే చికెన్ మాడిపోతుంది
  • ధం కోసం ప్లేట్ చుట్టూ మైదా పిండి తో సీల్ చేసుకోవచ్చు, లేదంటే మాలా టిష్యూ పేపర్స్ వేసి బరువైన ప్లేట్ తోనూ ధం చేసుకోవచ్చు
  • బిర్యానీ 15 నిమిషాలు డం చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కచ్చితంగా 15 నిమిషాల పైన కదపకుండా వదిలేయాలి.