ఎప్పుడైనా స్పెషల్ పులావు తినాలనుకుంటే ఇది పర్ఫెక్ట్. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. స్పైసి చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ తో అయితే ఈ కాజు పులావు ఇంకా బావుంటుంది. చాల ఈజీ గా చేసెయ్యొచ్చు. పిల్లలు కూడా చాల ఎంజాయ్ చేస్తారు!

కావలసినవి:

 • 2tsps Ghee
 • 2tsps Oil
 • 5 Cloves
 • 5 Green Cardamom
 • 1 Inch Cinnamon
 • 1tsp Shah Jeera
 • 1 Bay Leaf
 • 1 Onion Sliced
 • 2 Green Chilies
 • 75gms Cashews
 • 2 Green Chillies
 • 1tbsps Ginger Garlic Paste
 • 2tsps Mint Chopped
 • 2tbsps Coriander Chopped
 • Salt
 • 2 Pinches Turmeric
 • 1tbsp Dry Rose Petals
 • 1 Cup Basmati Rice

తయారీ విధానం:

Directions

0/0 steps made
 1. ముందుగా కుక్కర్ లో Oil, నెయ్యి హీట్ చేసుకుని, అందులో లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క, బిరియాని ఆకు, షాజీరా వేసి ఫ్రై చేసుకుని
 2. ఒక ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. సగం పైన ఫ్రై అయ్యాక
  జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేగితేనే రుచి చాల బావుంటుంది.
 3. జీడిపప్పు సగం పైన వేగాక అప్పుడు పచ్చి మిర్చి, పుదినా, కొత్తిమీర, అల్లం వేల్లూలి పేస్టు వేసి
  పచ్చి వాసనా పోయేదాక వేపుకుని సాల్ట్, పసుపు వేసి వేపుకోండి.
 4. ఇప్పుడు 300 ml నీళ్ళు పోసుకుని గానతకు పైగా నానా బెట్టిన బాసుమతి బియ్యం వేసుకోండి
  (ఇక్కడ సోన మసూరి బియ్యం వాడుకుంటే గనుక బియ్యం గంటకు పైగా నానబెట్టాలి, 1.3/4 cup నీళ్ళు పోసుకోవాలి)
 5. ఇప్పుడు ఎండిన దేశవాళీ గులాబి రేకులు 1 tsp వేసుకోండి. ఇది లేకపోతే పులావు దింపే ముందు 1/2tsp రోజ్ వాటర్ వేసుకోండి.
 6. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 whistle రానివ్వండి. సోనా మసూరి బియానికి అయితే 2 whistles రానివ్వండి.
 7. ఆ తరువాత 15 నిమిషాలు కదపకుండా వదిలేయండి.(ఇది చాల ముఖ్యం)
 8. 15 నిమిషాల తరువాత గులాబీ రేకులు లేకపోతే 1/2tsp రోజ్ వాటర్ వేసుకుని అడుగు నుండి అట్ల కాడతో కలుపుని సర్వ్ చేసుకోండి.

టిప్స్:

బాస్మతి బియ్యం ఏడాది కంటే పాతవి ఐ ఉండాలి.
జీడిపప్పు ఎర్రగా వేగితే రుచి
రోజ్ వాటర్ లేదా గులాబీ రేకులు అస్సలు మిస్ చేయకండి.