“కీవి కూలర్” బెస్ట్ డ్రింక్…చాలా రెఫ్రెషింగ్ డ్రింక్ ఇది. చేయడం చాలా ఈజీ. ఏదైనా స్పెషల్ డేస్ లో, పార్టీస్ లో ఈ డ్రింక్ ట్రై చేసి చుడండి, పార్టీకే హైలైట్ అయిపోతుంది. బాగా ఎండలుగా ఉన్నప్పుడు, సాయంత్రాలు దీని రుచి ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తారు!!!

కావలసినవి:

 • కీవి- 2(ముక్కలుగా చేసుకోవాలి)
 • నిమ్మకాయ- 1(చక్రాలుగా కోసుకోవాలి)
 • పంచదార- 2 tbsps
 • Sprite/ సోడా – 500 ml

విధానం:

Directions

0/0 steps made
 1. కీవి ని ముక్కలుగా కోసుకుని రోలులో వేసి క్రష్ చేసుకోండి, పేస్ట్ గా మాత్రం చేయకండి.
 2. నిమ్మకాయ చక్రాలు, పంచదార వేసి 80% క్రష్ చేసుకోండి కీవి ని.
 3. ఇప్పుడు కీవి మిక్సచర్ ని గ్లాస్ లో వేసి, 4 ఐస్ క్యూబ్స్ వేసి గ్లాస్ ని sprite/లేదా సోడా తో నింపండి.
 4. అంతే రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ.

టిప్స్:

 • నిమ్మకాయలు స్కిన్ తో సహా క్రష్ చేస్తేనే రుచి.
 • నిజానికి ఈ డ్రింక్ కి sprite రుచి చాలా బాగుంటుంది, సోడా కంటే.
 • డ్రింక్ చేసిన వెంటనే తగేస్తేనే అసలు మజా.