“లాప్సీ” ఇది మహారాష్ట్రా లో ఎంతో ప్రాచుర్యం పొందిన స్వీట్. దీన్నే కొందరు లాప్షీ అని కూడా అంటారు.

ఇది ప్రసాదం గా, ఎప్పుడైనా తీపి తినాలనిపించినా, చిన్న ఫంక్షన్స్ లో కూడా ఇది ఉండాల్సిందే. చేయడం ఎంతో తేలిక. కొన్నంతే వేసేవి నాలుగైదు పదార్దాలే కాని ఎంతో రుచుంటుంది. అదంతా వండే తీరుని బట్టి ఉంటుంది, ప్రేమగా చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది అని నా అభిప్రాయం. అమ్మ చేతి వంట కేవలం వంట కాదు, అమృతం. అందుకే ఎప్పుడూ బోర్ కొట్టదు.

ఇది సూర్యభగవానుడికి ప్రేత్యేకంగా 7 ఆదివారాలు సూర్యోదయానికి మునుపే ఆదిత్యహృదయం చదివి సూర్యోదయం వేళకి స్వామికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అంటోంది వేదం.

ఈ లాప్సీ లోనే ఎన్నో విధానాలున్నాయ్, కొందరు నీళ్ళకి బదులు పాలు, కొబ్బరి పాలు కూడా వాడతారు మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు.

కావలసినవి:

 • గోధుమ రవ్వ- ½ కప్
 • బెల్లం – ½ కప్
 • నెయ్యి- ½ కప్
 • నీళ్ళు పాకానికి- ½ కప్
 • పెసరపప్పు- 2 tbsps
 • నీళ్ళు ఉడికిన్చుకోడానికి- 2 కప్స్
 • యాలకపొడి- 1 tsp
 • జీడిపప్పు- 10-15
 • ఎండు ద్రాక్షా- 2 tsps

విధానం:

Directions

0/0 steps made
 1. Directions

  0/0 steps made
  1. గోధుమ రవ్వని నిదానంగా లో-ఫ్లేం మీద మాత్రమే మంచి సువాసనోచ్చెంత వరకు వేపుకోండి, ఆ తరువాత తీసి పక్కనుంచుకోండి
  2. తరువాత పెసరపప్పు కూడా నిదానంగా లో-ఫ్లేం మీద వేపుకుని తీసి పక్కనుంచుకోండి
  3. ఇప్పుడు బెల్లం లో ½ కప్ నీళ్ళు పోసి రెండు పొంగులు రానిచ్చి దిమ్పెసుకోండి
  4. ఇప్పుడు 2 కప్స్ నీళ్ళు మరిగించి అందులో గోధుమరవ్వా , పెసరపప్పు వేసి లో-ఫ్లేం మీద మాత్రమే నిదానంగా రవ్వ మెత్తగా ఉడికించుకోండి
  5. ఆ తరువాత బెల్లం పానకం వడకట్టి పోసుకుని, 2 tbsps నెయ్యి వేసి దగ్గర పడే దాక కలుపుకుంటూ మీడియం-ఫ్లేం మీద ఉడికించుకోండి
  6. దగ్గరపడ్డాక యాలకల పొడి వేసి బాగా కలుపుకుని దిమ్పెసుకోండి
  7. ఇప్పుడు మిగిలిన నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు ద్రాక్షా వేసి ఎర్రగా వేపి లప్సీ లో కలిపేసుకోండి

టిప్స్:

 • గోధుమ రవ్వ పేరు తో యెల్లో గా మార్కెట్ లో దొరికేది అది కార్న్ రవ్వ, బన్సీ రవ్వా అని అడిగితే ఇస్తారు అదే గోధుమ రవ్వ. దీనికి అదే వాడాలి
 • నీళ్ళ కి బదులు పాలు, కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు
 • బెల్లం పాకం పోసాక రవ్వ ఉడకదు కాబట్టి గోధుమ నూక ఉడికాక మాత్రమే బెల్లం పాకం పోసుకోవాలి
 • బెల్లం కరిగి పొంగోస్తే చాలు తీగ పాకం పట్టక్కర్లేదు
 • నెయ్యి లో జీడిపప్పు తో పాటు 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేస్తారు మహారాష్ట్రా వాళ్ళు మీరు అలా కూడా వేసుకోవచ్చు యాలకపొడి వదిలేసి