“మిక్స్ వెజ్ ఘీ కిచిడి” ఇది ఆరు నెలల పసి పాప నుండి పెద్దవారి వరకు అందరు హాయిగా తినొచ్చు. ఏదైనా రైస్ ఐటెం చేద్దామనుకుంటే అన్నింటిలోనూ మసాలాల ఘాటు. ఎప్పుడో ఓ సారి పర్లేదుగాని రోజూ తినాలంటే మొహం మొత్తుతుంది. కాని ఈ కిచిడి హాయిగా ఉంటుంది పొట్టకి. ఆఫీస్లకి వెళ్లేవారికి, పిల్లల లంచ్ బాక్స్ ల్లోకి పర్ఫెక్ట్ ఈ కిచిడి. మధ్యాన్నానికి కూడా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో మేము రోజూ తినే అన్నం కూరలు కాకుండా ఏదైనా ట్రై  చేద్దామనిస్తే వెంటనే ఇదే చేస్తాం. కొన్ని సార్లు ఒక్కో కూరగాయ మిగిలిపోతుంది, అప్పుడూ అన్నీ కలిపేసి ఇది ట్రై చేస్తాం. బద్దకంగా ఉన్న రోజు కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఎలా ట్రై చేసినా పర్ఫెక్ట్ ఈ కిచిడి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

కావలసినవి:

 • బియ్యం- 1 కప్ (గంట పాటు నానా బెట్టుకున్నది)
 • పెసరపప్పు- 1 కప్ ( 30 నిమిషాలు నన బెట్టుకున్నది)
 • పచ్చిమిర్చి- 4
 • నెయ్యి- ½ కప్
 • సాల్ట్
 • పసుపు
 • బంగాల దుంప- 1
 • క్యారట్- 1
 • ఫ్రెంచ్ బీన్స్- 4
 • వంకాయలు- 3 పోడుగువి
 • కరివేపాకు- 2 రెబ్బలు
 • ఎండు మిరపకాయలు-4
 • ఆవాలు
 • కొత్తిమీర- 1 కట్ట
 • నీళ్ళు- ౩ కప్స్

విధానం:

Directions

0/0 steps made
 1. Directions

  0/0 steps made
  1. కుక్కర్ లో నెయ్యి కరిగించి అందులో ఎండుమిర్చి, ఆవాలు వేసి చిటపటమన్నాక, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు వేపుకోండి
  2. ఆ తరువాత ఒక్కో కాయకూర వేసి మగ్గించుకుంటూ మరొకటి వేస్తూ మగ్గించుకోండి. పూర్తిగా కాయకూరలని కుక్ చేసుకోకండి
  3. సగం పైన మగ్గాక సాల్ట్, పసుపు వేసి పెసరపప్పు, బియ్యం వేసి రెండు నిమిషాలు వేయించుకోండి
  4. ఇప్పుడు 3 కప్స్ నీళ్ళు పోసి మీడియం-ఫ్లేం మీద 2 విసిల్స్, హై ఫ్లేం మీద 1 విసిల్ రానిచ్చి, 20 నిమిషాలు వదిలేయండి
  5. ఆ తరువాత మూత తీసి అడుగు నుండి అట్లకాడ తో కలిపి పైన మరో 2 tsps నెయ్యి కొత్తిమీర వేసి దిమ్పెసుకోండి
  6. వేడిగా అయినా చల్లగా అయినా చాల రుచిగా ఉంటుంది. టమాటో రోటి పచ్చడి, లేదా ఏదైనా రైతా తో చాల బాగుంటుంది. మా ఇంట్లో మేము ఆవకాయతో తిని, మజ్జిగ తో ముగిస్తాం!!!

టిప్స్:

 • ఇందులో మీరు ఉల్లిపాయలు, తాజా బాటానీ లు కూడా వేసుకోవచ్చు
 • ఈ కిచిడి నెయ్యితో చేస్తేనే అసలు మజా
 • బియ్యం వేయించుకోవడం వల్ల కిచిడి పొడి పొడిగా ఉంటుంది
 • కిచిడి ఉడికాక అడుగు నుండి అట్లకాడ తో కలుపుకోండి, అప్పుడు అన్నం చిదురవదు