“చికెన్ బఫెలో వింగ్స్” ఇవి మంచి పార్టీ స్నాక్ ఐటెం. ఎవ్వరూ ఒక్క దానితో ఆపలేరు. ఓ సారి మా స్టైల్లో చేస్తే ఇక మళ్ళీ మీకు బయట దొరికే వింగ్స్ నచ్చేనే నచ్చవ్, భలేగా ఉంటాయి. స్పైసిగా, క్రిప్స్పీగా. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. చేయడం కూడా చాలా ఈజీ. కొంచెం జాగ్రత్తగా టిప్స్ తో సహా చదివి చేయండి.

వింగ్స్ కోటింగ్కి కావలసినవి:

 • చికెన్ వింగ్స్- 300gms(30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టినవి)
 • పాప్రికా- ¾ tsp
 • సాల్ట్
 • కారం- 1 tsp
 • మిరియాల పొడి- ½ tsp
 • మైదా- ¼ కప్
 • నూనె- వేయించడానికి సరిపడా

టాసింగ్ కోసం:

 • బటర్- ¼ కప్
 • హాట్ సాస్- ¼ కప్
 • సాల్ట్
 • సోయా సాస్- 1/2 tsp
 • వెనిగర్- ½ tsp
 • పాప్రికా- ½ tsp
 • వెల్లూలి పొడి – ½ tsp
 • పంచదార- ½ tsp
 • కారం- ½ tsp
 • మిరియాల పొడి- ½ tsp
 • వేయించిన నువ్వులు- 1 tsp

విధానం:

Directions

0/0 steps made
 1. 30 నిమిషాలు పైన కడిగి ఉప్పు నీటిలో నానా బెట్టిన చికెన్ వింగ్స్ వేసి ఉంచండి.
 2. తరువాత వాటిని వడకట్టి మిక్సింగ్ బౌల్ లో వేసి అందులో కోటింగ్ కోసం ఉంచుకున్న సామానంతా వేసి ఒక్క మైదా తప్పా బాగా పట్టించండి.
 3. బాగా పట్టించాక అప్పుడు మైదా వేసి బాగా కోట్ చేసుకోండి, మీకు మరీ క్రిస్పీ గా కావాలనుకుంటే 1 tbsp బియ్యం పిండి వేసుకోండి ఇంకా క్రిస్పీ గా వస్తాయ్.
 4. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద క్రిస్పీగా వేపుకోండి.
 5. ఇవి క్రిస్పీ గా వేగడానికి కనీసం 20 నిమిషాల పైనే టైం పడుతుంది, కేవలం మీడియం ఫ్లేం మీదే వేపాలి.
 6. బాగా క్రిస్పీ గా వేపి తీసి పక్కనుంచుకోండి.
 7. ఇప్పు మరో పాన్ నో బటర్ కరిగించి, అందులో హాట్ సాస్ తో పాటు మిగిలిన సామానంతా వేసి బాగా కలుపుకుని హై-ఫ్లేం మీద నూనె పైకి తేలేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి.
 8. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ వింగ్స్ వేసి కేవలం హై ఫ్లేం మీద మాత్రమే చికెన్ కి పట్టించండి.
 9. సాసేస్ అన్నీ చికెన్ పీల్చుకున్నాక దిమ్పెసుకుని పైన 1 tsp వేయించిన నువ్వులు చల్లుకుని ఎంజాయ్ చేయండి.

టిప్స్:

 • చికెన్ వింగ్స్ ఉప్పు నీటిలో నానబెడితేనే ముక్క సాఫ్ట్ అవుతుంది, లోపలిదాక వేగుతుంది ముక్క.
 • వింగ్స్ వేపేప్పుడు నూనె కచ్చితంగా వేడిగా ఉండి తీరాలి, వింగ్స్ వేసాక మీడియం-ఫ్లేం మీద మాత్రమే ఎర్రగా క్రిస్పీ గా వేపుకోవాలి, నూనె వేడెక్కకుండా వింగ్స్ వేస్తే నూనె బాగా పీల్చేస్తాయ్.
 • వింగ్స్ ని హై-ఫ్లేం మీద వేపితే రంగోస్తాయ్ కాని లోపల ముక్క ఉడకదు. టైం తీసుకుని ఓపికగా వేపుకోండి.
 • ఇందులో వాడిన పాప్రికా అనేది ఓ రకమైన కారం, మంచి ఫ్లేవర్, రంగు తో ఉంటుంది, ఇవి మీకు online లో దొరుకుతుంది.
 • గార్లిక్ పౌడర్ వాడితే రవ్వ రవ్వగా బావుంటుంది వింగ్స్ కి, దొరక్కపోతే గార్లిక్ పేస్టు వాడుకోవచ్చు.
 • కచ్చితంగా వింగ్స్ జూసీ గా ఉండాలంటే హాట్ సాస్ ఉండాల్సిందే, ఇది మీకు కచ్చితంగా supermarkets లో లేదా online లో దొరుకుతుంది.
 • పంచదార వేయడం వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ బాలన్స్ అవుతాయ్.
 • వింగ్స్ ని హై- ఫ్లేం మీదే తోస్స్ చేయాలి లేకపోతే వింగ్స్ ససులలో ఉడుకుతాయ్, అప్పుడు వింగ్స్ మెత్తగా అవుతాయ్.
 • వింగ్స్ అసలు మజా ఏంటో తెలియాలంటే వేడి వేడిగానే తినాలి.