చికెన్ స్టాక్ కోసం

 • చికెన్ బోన్స్ 100gms
 • 1tsp షాజీరా
 • 1/2 tsp మిరియాలు
 • ౩ యలకలు
 • 4 లవంగాలు
 • 1 లీటరు నీళ్ళు
 • 1/4 tsp పసుపు
 • 1 ఇంచ్ దాల్చిన చెక్క
 • 1/2 కట్ట కొత్తిమీర కాడలతో

పులావు కోసం

 • 2 tbsps నెయ్యి
 • 1 tbsp నూనె
 • 1 ఇంచ్ దాల్చిన చెక్క
 • 1 నల్ల యాలక
 • 1 అనసపువ్వు
 • 2 పచ్చ యాలకలు
 • 4 లవంగాలు
 • 1 బిర్యానీ ఆకు
 • 1 tsp షా జీరా
 • 1 ఉల్లిపాయ సన్నని చీలికలు
 • 1/2 కిలో చికెన్
 • 1 tbsp అల్లం వెల్లులి పేస్టు
 • సాల్ట్
 • 1/4 పసుపు
 • 1/2 tsp గరం మసాల
 • 3 పచ్చి మిర్చి చీలికలు
 • 2 tbsps కొత్తిమీర తరుగు
 • 2 tbsps పుదినా తరుగు
 • 1.5 కప్స్ చికెన్ స్టాక్(తయారు చేసుకున్నది)
 • 1.5 కప్స్ బాస్మతి బియ్యం-225 gms (గంట పాటు నానా బెట్టినది)
 • 1 tsps ఎండిన దేశవాళి గులాబి రేకులు

తయారి విధానం

Directions

0/0 steps made
 1. అడుగు మందంగా ఉన్న పాన్ లో నీళ్ళు స్టాక్ కోసం ఉంచుకున్న సామానంతా వేసి కేవలం లో-ఫ్లేం మీద సగం పైన ఇగిరి పోయేట్లు మరిగించుకోండి. లో-ఫ్లేం లో మరిగిస్తేనే ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అయ్యి మంచి రుచోస్తుంది స్టాక్ కి. దీనికి మీకు కనీసం 50 నిమిషాల పైనే పడుతుంది.
 2. బాగా మరిగిన స్టాక్ ని వడకట్టుకుని పక్కనుంచుకోండి
 3. పులావు కోసం కుక్కర్ లో నెయ్యి నూనె వేసి మసాలా దినుసులన్నీ వేసి ఉల్లిపాయ వేసి ఎర్రగా వేపుకోండి.
 4. ఉల్లిపాయలు వేగాక 30 నిముషాలు ఉప్పు నీటి లో నానా బెట్టిన చికెన్ వేసి హై-ఫ్లేం మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకుని, ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లులి పేస్టు వేసుకుని ఫ్రై చేసుకోండి
 5. పసుపు, ఉప్పు, గరం మసాలా , పుదినా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి హై -ఫ్లేం మీద మరో ౩ నిమిషాలు ఫ్రై చేసుకోండి
 6. ఇప్పుడు 1.5 కప్స్ చికెన్ స్టాక్ పోసుకుని, 1.5 కప్స్ గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం, గులాబీ రేకులు వేసుకోండి.
 7. ఎండిన దేసవాలి గులాబీ రేకులు మంచి సువానిస్తుంది పులావు కి, గులాబీ రేకులు లేకపోతే దింపే ముందు 1 tsp రోజ్ వాటర్ వేసుకోండి.
 8. మూత పెట్టి లో-ఫ్లేం లో 1 విసిల్ రానిచ్చి, స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు వదిలేయండి.
 9. ఆ తరువాత అట్ల కాడతో అడుగు నుండి కలుపుకోండి.
 10. అంతే ఎంతో టేస్టీ టేస్టీ యఖ్ని పులావు రెడీ.

టిప్స్:

 • కచ్చితంగా స్టాక్ లో-ఫ్లేం లో మరిగించుకోవాలి, ఎంత ఎక్కువ టైం తీసుకుని మరిగించుకుంటే అంత రుచోస్తుంది స్టాక్ కి. ఈ పులావ్ కి రుచంతా ఈ స్టాక్ లోనే ఉంది
 • బియ్యం స్టాక్ సమానంగా తీసుకోవాలి, ఇదే సోనా మసూరి బియ్యానికైతే ఒకటికి ఒకటిన్నర స్టాక్ పోసుకుని సిం లో రెండు విసిల్స్ రానివ్వాలి.
 • బియ్యం గంట పైన నానా బెట్టుకోవాలి.
 • స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు కచ్చితంగా వదిలేయాలి.